ఈ అన్న అందరిలాంటి లీడర్ కాదు..అన్న వేరే…!
ఈ అన్న అందరనుకునే క్యారెక్టర్ కాదు..అన్న వేరే!
నమస్తే పెడితే చూడకుండా పోయే బాపతి కాదు
పలకరిస్తే కూడా పట్టించుకోకుండా పోయే సోపతి కాదు
ఒక ఫోటో దిగుదామని పోతే కసురుకునేవాడు కాదు
గెలిపించిన కార్యకర్తలని కూడా గుర్తుపట్టని గజినీ కాదు!
మనం కనపడగానే తనే పేరు పెట్టి పిలుస్తూ నవ్వుతూ పలకరిస్తాడు..
దా ఫోటో దిగుదాం అంటూ మనతోనే సెల్ఫీ దిగుతాడు..
నవ్వుతూ..నవ్విస్తూ..అందరినీ దగ్గరికి తీసుకుంటాడు..
కష్టపడే కార్యకర్తలను గుర్తించి గుండెకి హత్తుకుంటాడు..
అన్నతో సెల్ఫీ దిగాలని వచ్చే వందలమందికి టైం ఇస్తాడు..
అలుపు,సొలుపు ఉండదు..ఆకలి,దప్పిక వేయదు
ఎందుకంటే కార్యకర్తకు గౌరవం ఇస్తాడు కాబట్టి..
అన్నను కలవాలంటే సెక్యూరిటీ కంచెలు,రికమండేషన్లు అక్కర్లేదు..
ఎందుకంటే అన్నకి అందరూ ఆప్తులే..అందరూ దోస్తులే!

కార్యకర్త నుంచి ఎంత అందనంత ఎత్తుకు ఎదిగినా..
చివరికి నేను కూడా కార్యకర్త అనే క్యారెక్టర్ ఉన్నవాడు..
హిందూ ధర్మం కోసం నిలబడే నియ్యత్ గల నాయకుడు..
సగర్వంగా చెప్పుకునే హిందువు..అందరి ప్రియ బంధువు
కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నకి పుట్టిన రోజు శుభాకాంక్షలు 🌺🚩🚩..జై శ్రీరామ్🚩 (అన్న ఎంపీగా మొదటిసారి గెలిచిన రోజు😊)
నాస్పందన #బండిసంజయన్న #పుట్టినరోజుశుభాకాంక్షలు
Bandi Sanjay Kumar
@highlight