మీ ఆశయం మీ ఆవేశం స్వతంత్రం కోసమే
మీ ఆరాటం మీ పోరాటం స్వరాజ్యం కోసమే
బతుకు మీద ఆశ లేదు చావు మీద బాధ లేదు
దేశమే తమ ప్రాణంగా స్వతంత్రమే తమ ఊపిరిగా
తెల్లోడి గుండెల్లో బాంబుల మోత మోగించి
నిద్రబోతున్న దేశ ప్రజల్లో స్వతంత్ర కాంక్ష రగిలించి
ఉగ్గుపాల వయసు నుండి ఊపిరి పోయేదాకా పోరుసల్పి
ఉరికొయ్యలను ముద్దాడి దేశం కోసం ఆనందంగా
ఆత్మ బలిదానం చేసుకున్న మీ త్యాగమే ఈ దేశ స్వతంత్రం
మీ పోరాటమే నేటి భారతదేశ స్వేచ్ఛా స్వరాజ్యం..
స్వాతంత్య్రం కోసం ఉరికొయ్యలను ముద్దాడిన షహీద్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లు 23 ఏళ్ల వయసులోనే తృణప్రాయంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన రోజు మార్చి 23 బలిదాన్ దివస్.
ఈ సందర్భంగా ఆ అమరవీరులకు నివాళులు…వారి త్యాగాలను స్మరిద్దాం..భావితరాలకు తెలియజేద్దాం..జై హింద్🇮🇳
Watch Video
#నాస్పందన #బలిదాన్ దివాస్ #మార్చి23
