నాడు..తెలంగాణ హీరో కేసీఆర్.. ఇప్పుడు_______?

అవును నిజంగానే నేడు కేసీఆర్ పరిస్థితి ఇదే..
10 ఏళ్లు తెలంగాణని ఏలిన కేసీఆర్ కి నేటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలుస్తుందా అనేకాడికి వచ్చింది..
కారు గుర్తుపై పోటీ చేస్తే చాలు ఎమ్మెల్యే,ఎంపి,ఎమ్మెల్సీ ఇలా ఏదో ఒకటి అయిపోవచ్చు అనే పొజిషన్ నుంచి..
అదే కారు గుర్తుపై పోటీ చేయమని అంటే ఎవరూ ముందుకు రాకుండా పారిపోయే సీన్ ఈరోజు..

17 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థులు దొరకని వేల గెలిచిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను నిలబెట్టే పరిస్థితి..

ఒకప్పుడు ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వని వ్యక్తి ఈరోజు చిన్నా చితకా పార్టీలతో పొత్తుల కోసం వెంపర్లాడే స్థాయికి చేరుకున్నాడు కేసీఆర్..
పదేళ్లల్లో కేసీఆర్ చేసిన అవినీతి,కుటుంబ పాలన అహంకారం,లెక్కలేనితనం,చిన్నచూపు,దొర పాలన అన్నీ కేసీఆర్ పై వ్యతిరేకత పెంచినయి..మొత్తానికి తెలంగాణలో BRS పని అయిపోయినట్టే కనిపిస్తుంది..
పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేలోపు BRS పార్టీ ఖాళీ అయ్యేలాగానే అనిపిస్తుంది..

ఒకసారి 2014 ముందుకెళితే..
తెలంగాణ ఉద్యమాన్ని తన స్పీచ్ లతో ఉర్రూతలూగించిన వ్యక్తి కేసీఆర్..
కేసీఆర్ ప్రెస్ మీట్ అయినా,బహిరంగ సభ అయినా చెవులు రిక్కించి వినేవాళ్ళు ఎవరైనా..
మీడియా ఛానళ్ళు కేసీఆర్ మీటింగ్స్ లైవ్ ఇచ్చి TRP పెంచుకునేవి..
TRS అంటే తెలంగాణ పార్టీ అని ప్రతీ ఊరిలో ప్రతీ ఒక్కరూ ప్రేమించిన పార్టీ..
కేసీఆర్ అంటేనే తెలంగాణ,తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే స్థాయిలో 2014 వరకు నడిచింది..

కేసీఆర్ అంటే తెలంగాణ బ్రాండ్ అనేవిధంగా నడిచింది..
ఓడలు బళ్లు అయితయి..బళ్లు ఓడలు అయితయి అంటే ఇదే అనుకుంటా..

ప్రధాని కావాలనుకున్నడు..TRS ని BRS చేసిండు..మోడీ వస్తే మొఖం చాటేసి నానా మాటలు అని అవహేళన చేసిండు..అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అంటూ ఆశలో పల్లకిలో ఊరిగిండు..నేడు కాలు విరిగి మంచాన పడి ఇబ్బందులు పడుతున్నాడు..

కొడుకు అహంకారం,బిడ్డ లిక్కర్ స్కాంతో జైలు పాలు,ఇలా BRS పార్టీ ప్రజలకు దూరమైపోయింది..
నేడు BRS కి ఓటు వేసేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడం చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకుండా జీరో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

అందుకే ఒకప్పుడు కేసీఆర్ హీరో..
కానీ నేడు మాత్రం జీరో..కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..జై హింద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *