రాహుల్ గాందీపై పోటీ చేస్తున్నది ఎవరో తెలుసా?
రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశాడు.
ఒకటి అమేథీ..కేరళలో వయనాడ్ నుంచి మరో చోట..
అమేథీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు..
వయనాడ్ పూర్తిగా ముస్లిం జనాభా మెజారిటీ ఉండే లోక్ సభ స్థానం..
చావు తప్పి కన్ను లొట్ట బోయిన చందంగా ముస్లిం ఓట్లతో వయనాడ్ కి పోయి గెలిచి పరువు దక్కించుకున్నాడు..
రాహుల్ గాంధీతో తలబడపోయే వ్యక్తిని బీజేపీ 5వ లిస్ట్ లో ప్రకటించింది.బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్,ఫైటర్ గా పేరున్న కున్నుమల్ సురేంద్రన్ ని వయనాడ్ లో రాహుల్ గాంధీపై పోటీకి నిలబెట్టింది.

సురేంద్రన్ ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా అనేక బాధ్యతల్లో పనిచేసి అనంతరం రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
BJYM రాష్ట్ర అధ్యక్షుడిగా సురేంద్రన్ 2009 అక్టోబర్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో అవకతవకలపై వ్యతిరేకంగా పాదయాత్రకు నాయకత్వం వహించారు.ఇదే సందర్భంలో కేరళలోని సెక్రటేరియట్‌లోకి చొచ్చుకెళ్లేoదుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని లాఠీఛార్జ్ చేయడంతో సురేంద్రన్ సహా అనేకమంది కార్యకర్తలు గాయపడ్డరు.
డైరెక్టర్ ఆఫ్ నార్త్ మలబార్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ, సేవా సాంస్కృతిక కేంద్రం ప్రెసిడెంట్ గా, ఫౌండర్ డైరెక్టర్ బోర్డ్ మెంబర్ నేషనల్ యువ కో-ఆపరేటివ్ సొసైటీ మరియు అడ్వైజరీ బోర్డు సభ్యుడు నెహ్రూ యువకేంద్ర వంటి వివిధ పదవులను నిర్వహించారు.చాలా సంవత్సరాల క్రితం కాసరగోడ్‌కు వెళ్లి స్థానిక ప్రజలతో మెరుగ్గా సంభాషించడానికి తుళు మరియు కన్నడ భాషలు నేర్చుకున్నాడు .
సురేంద్రన్ ఫిబ్రవరి 15, 2020న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.కమ్యూనిస్టుల కంచుకోటలో బీజేపీ జాతీయవాద సిద్దాంతాన్ని ముందుకు తీసుకపోయి బీజేపీని చాప కింద నీరులా విస్తరించాడు.

శబరిమలలో మహిళలకు ప్రవేశం అని సీపీఎం పిచ్చిగా ప్రవర్తించినపుడు సురేంద్రన్ పెద్దయెత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించాడు.
సురేంద్రన్ జీ.. మీ గెలుపు ఖాయం
Jay Hind Jay bolo Bharat mata ki Jay Shri Ram Ram Lakshman Janki Jay bolo Hanuman ki pakka BJP