వరంగల్ పార్లమెంట్ పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య!
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనయ కడియం కావ్యని కేసీఆర్ వరంగల్ ఎంపి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే..
అయితే BRS పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత,లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్, భూ కబ్జాలు,ఫోన్ ట్యాపింగ్ తదితర ఇస్యూస్ తో BRS పార్టీపై తీవ్రంగా వ్యతిరేకత పెరిగిందని,పార్టీ ప్రతిష్ట దిగజారిందని,పార్టీలో కూడా సమన్వయం,సహకారం లేదని,ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా తయారయిందని ఈ పరిస్థితుల్లో పోటీ చేయలేనని పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కేసీఆర్ కి కడియం కావ్య లేఖ రాసింది..

ఇప్పుడు కడియం శ్రీహరి అయినా BRS లో ఉంటారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి..
మొత్తానికి BRS అధికారం కోల్పోయి 4 నెలలు కూడా గడవక ముందే పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితికి కేసీఆర్ పార్టీ చేరింది..

Very nice
ప్రజా శ్రేయస్సు కోరుకునే వ్యక్తి ఎన్నికల లో పోటీ చేయాలి. ఇప్పుడు ఆస్తులు పెంచుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పల మార్చే నాయకులు వసుత్తూరు ఇదేం పరిపాలన
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పెట్టుడు కాను రాష్ట్రంలో ఎక్కడ నిరుపేదలు ఉన్నారో అక్కడికి మంత్రులే కానీ MLA కానీ సందర్శించి వాళ్ళ బాధలను తీర్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే. MBBS డాక్టర్. ఇంజనీరింగ్ చదువులకు ఉచితంగా గవర్నమెంట్ చదివిస్తే ఈ సంక్షేమ పథకాలు అవసరమే ఉండదు. రాష్ట్రంలో పేదరికం ఉండదు. దయచేసి ఏ పార్టీ అధికారంలో ఉన్న నిరుపేద కుటుంబాల పిల్లలను చదివిస్తే అందరు సమానులే అవుతారు.ఇట్లు కొత్త బాలరాజు గౌడ్ జర్నలిస్ట్ నారాయణపురం యాదాద్రి భువనగిరి జిల్లా cell :6303875286
తెలంగాణ రాష్ట్రంలో వరసత్వ రాజకీయాలు వస్తున్నాయి. ఏ పార్టీలోనైనా ఒకసారి ముఖ్యమంత్రి. మంత్రి. MLA అయినచో వాళ్ళకి మల్లి అవకాశం ఇవ్వకుండా కొత్త వారికి ఛాయస్ ఇవ్వాలి. దానికి ఒక ప్రత్యేక చట్టం తేవాలి. కడియం శ్రీహరి కూతురికి టికెట్ ఇచ్చే బదులు కొత్త వారికి ఇవ్వాలి.