వందరోజులు అయింది గుంపు మేస్త్రీ గుర్తుందా?

వంద రోజుల్లో చేస్తామన్న హామీలు ఏమైనవి గుంపు మేస్త్రీ గారు?

  1. రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైంది ?
  2. రైతుభరోసా కింద రూ.15 వేలు ఏమైంది?
  3. వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైంది ?
  4. ప్రతి మహిళకు రూ.2500 ఎప్పుడు ఇస్తారు?
  5. ఒకటో తేదీన జీతాలు అందరికీ ఎప్పుడు వేస్తారు?
  6. ఆటో డ్రైవర్లకి ఇస్తామన్న రూ.12 వేలు ఇస్తారా ఇయ్యరా?
  7. తులం బంగారం కథ ఏమైంది ?
  8. 4వేల రూపాయల నిరుద్యోగ భృతి సంగతి ఏంది ?
  9. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఎప్పుడో?
  10. 5 లక్షల విద్యా భరోసా కార్డు హామీ ఏమైంది?
  11. ప్రతి యువతికి ఇస్తామన్న స్కూటీ సంగతి ఏంది?

ఇలా వందల హామీలు ఇచ్చి వంద రోజుల లోపు చేస్తామన్న హామీల సంగతి గుంపు మేస్త్రీ మరిచిపోయిండు..

రోజుకో సమస్యపై డైవర్ట్ చేస్తూ కాలం ఎల్లదీస్తున్నారు.
కాళేశ్వరం అక్రమాలు,అవినీతి అంటూ కొంత కాలం మాట్లాడి దానికి కారణమైన వారిపై చర్యలు లేవు..అరెస్ట్ లు లేవు..విచారణలు లేవు..అంతా సైలెంట్..

కరెంట్ మీద కొన్ని రోజులు గాయి గత్తర లేపి CMD ప్రభాకర్ రావు పై చర్యలు,శ్వేత పత్రాలు విడుదల చేసి ఇగ చర్యలు,అగ చర్యలు అని మళ్ళీ సైలెంట్…

డ్రగ్స్ ముఠా,గంజాయి,విచారణ అంటూ కొంతకాలం ఎల్లదేసి చర్యలు ఏమి లేవు..మళ్ళీ సైలెంట్..

ఎంపీ ఎన్నికలు అయ్యేవరకు చిన్న చిన్న గ్యారెంటీలుగా చెప్పుకొనే హామీలు అమలు చేసి మిగతా హామీలు అమలుపై మళ్ళీ సైలెంట్..

కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ కి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం అప్పచెబితే..

వందరోజుల్లోనే ప్రజలకు కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరుగుతుంది.
2 లక్షల రుణమాఫి చేయకుండా..
ఎకరానికి 15 వేల రూపాయల రైతుబంధు వేయకుండా..
మహిళలకు 2500 రూపాయలు ఇయ్యకుండా..
తులం బంగారం,స్కూటిలు పథకాలు అమలు చెయ్యకుండా దాటవేస్తూ వస్తున్న కాంగ్రెస్ మోసం జనాలు గుర్తించారు..

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలి అని హామీ ఇచ్చిన ప్రజలు ఇప్పుడు మోడీకి,బీజేపీకి ఓటు వేయడానికి సిద్దంగా ఉన్నారు..

అయినా నిధులు ఇచ్చేది కేంద్రం..
అందుకే డైరెక్ట్ బీజేపీ కి ఓటు వేస్తే అభివృద్ది జరుగుతుందని జనాలు అభిప్రాయపడుతున్నారు..

ఈ లెక్కన రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను దాటి బీజేపీ ఎక్కువ ఎంపి సీట్లు గెలుచుకునే పరిస్థితి కనిపిస్తుంది..

నరెడ్ల ప్రవీణ్ రెడ్డి..

జై హింద్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *