తెలంగాణలో 11 సీట్లు పక్కా గెలవనున్న బీజేపీ..
అవును మీరు చదివింది నిజమే..
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 11 సీట్లు గెలవనుంది.అవి ఏ నియోజకవర్గాలు అంటే 2019 లో గెలిచిన నాలుగు సీట్లు మళ్ళీ గెలుస్తూనే ఇంకొక 7 సీట్లల్లో విజయ బావుటా ఎగురవేయనున్నది..
గెలవబోయే సీట్లు ఇవే..
1.అదిలాబాద్
2.నిజామాబాద్
3.కరీంనగర్ 4.సికింద్రాబాద్
5.చేవెళ్ల
6.మల్కాజిగిరి
7.మహబూబ్ నగర్
8.భువనగిరి
9.మెదక్
10.జహీరాబాద్
11.వరంగల్
ఒకసారి విశ్లేషిస్తే
ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 8 సీట్లల్లో 7 సీట్లు అదిలాబాద్,నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గెలిసిన విషయం తెలిసిందే.
అదిలాబాద్ నుంచి నగేష్,నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ గెలవడం లాంఛనమే..ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డ్ ఇప్పటికే మోడీ ప్రకటించడం,షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తానని అరవింద్ హామీ ఇవ్వడం,వేల కోట్ల నిధులు తీసుకురావడం,కవిత అరెస్ట్ కావడంతో అరవింద్ కి ఎదురులేకుండా ఉంది..మహారాష్ట్ర బార్డర్ కావడం,నార్త్ ప్రజలు ఎక్కువగా ఉండడం,నగేష్ కి కలిసివచ్చే అంశం.నలుగురు ఎమ్మెల్యేలు అదిలాబాద్ పార్లమెంట్ నుంచే గెలవడం సానుకూల అంశం.
కరీంనగర్ నుంచి బండి సంజయ్ గెలుపు కూడా నల్లేరు మీద నడక లెక్కనే ఉంది.ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇంకా ప్రకటించనేలేదు.బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది.మాజీ ఎంపి వినోద్ కుమార్ కూడా నాన్ లోకల్ అనే ముద్ర బలంగా ప్రజల్లోకి వెళ్తుంది.పైగా ఇప్పటికే బండి సంజయ్ పార్లమెంట్ అంతా ప్రజాహిత యాత్ర పేరుతో పాదయాత్ర చేసి ప్రజలతో మమేకం కావడం,వేల కోట్లతో అభివృద్ది పనులు చేయడం,రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక ప్రజా సమస్యలపై కొట్లాడడం,జైళ్లకు పోవడం,ముఖ్యంగా యువతలో పెద్దయెత్తున క్రేజ్ ఉండడం మొత్తంగా భారీ మెజారిటీతో బండి సంజయ్ గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది.బీజేపీ గెలిచే మొదటిసీటు కూడా ఇదే అని కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు.
సికింద్రాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ చేస్తుండడం కేంద్రమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి,ముఖ్యంగా సికింద్రాబాద్ లో అత్యధిక అభివృద్ది పనులు చేయడం,మోడీ మ్యాజిక్ ఉండడం కలిసివచ్చే అంశం.BRS నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే పద్మారావు ఉన్నా BRS పై తీవ్రమైన వ్యతిరేకత ఉండడం పద్మారావుకి మైనస్ పాయింట్..
కాంగ్రెస్ కి పెద్దగా నగరంలో బలం లేకపోవడం వల్ల కిషన్ రెడ్డి గెలవడం లాంఛనమే..
చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలవడం కూడా ఖాయమే..మాజీ ముఖ్యమంత్రి కుటుంబం అయినా అందరితో కలిసిపోయే వ్యక్తిత్వము,సింప్లిసిటీ, అభివృద్ది విషయంలో ఆలోచించేతత్వం,గతంలో ఎంపిగా చేసిన అభివృద్ది పనులు,తెలంగాణ ఉద్యమకారుడిగా ముద్ర,చేవెళ్ళలో బలంగా ఉన్న పార్టీ మొత్తానికి కొండా గెలవటం కూడా పక్కా..
మహబూబ్ నగర్ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు DK అరుణ పోటీ చేస్తున్న తరుణంలో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంది.
గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం,పార్టీ కూడా బలంగా ఉండడం,కేంద్ర పార్టీ పెద్దలతో పరిచయాలు ఉండడం వలన పార్లమెంట్ కి అభివృద్ది పనులు చేయించే అవకాశం ఉండడం,గెలిస్తే కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతున్న సమయంలో DK అరుణ కూడా గెలవునున్నది అని సమాచారం..
భువనగిరిలో కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉంది.ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉన్నా ప్రకటించిన అభ్యర్థి పెద్దగా ఎవరికీ బాగా తెలిసిన వ్యక్తి కాకపోవడం,కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా టికెట్ ఆశించి భంగపడిన సందర్భంలో ఎంతవరకు కలిసి పనిచేస్తారో తెలియదు.
ఇక్కడ బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎంపిగా పని చేసినవాడిగా,3లక్షల ఓట్లు గౌడ్ సామాజిక వర్గం నుండి ఉండడం కలిసివచ్చే అంశం..
BRS పార్టీ నామమాత్రం కావడం వల్ల బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండనుంది.
దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం అయిన మల్కాజిగిరిలో మాజీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నాడు.పరిచయం అక్కర్లేని నాయకుడు,తెలంగాణ ఉద్యమకారుడిగా,కేసీఆర్ పై కొట్లాడిన నేతగా ఈటల రాజేందర్ అందరికీ తెలిసినవాడు..హిందూ సెంటిమెంట్ ఎక్కువ ఉండడం,నార్త్ ప్రజలు ఎక్కువగా ఉండడం, సెటిలర్లు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉండడం వలన అక్కడికి వెళ్లే వాళ్ళే ఎక్కువ కావడం ఈటల రాజేందర్ కి కలిసి వచ్చే అవకాశం.ఇక్కడ BRS పెద్ద ఉనికిలో లేదు..కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉన్నది..ఈటల గెలవడం కూడా ఖాయమే..
జహీరాబాద్ లో బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీగా బరిలో ఉండడం,కర్ణాటక బార్డర్ గా ఉండడం, BRS వీక్ కావడం వల్ల బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉన్నది.మోడీ హవాలో ఎక్కువ అవకాశాలు బీజేపీకే ఉన్నాయని తెలుస్తుంది.
మెదక్ లో బీజేపీ,కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉన్నది.ఇక్కడి నుంచి 2019లో పోటీచేసిన రఘునందన్ రావుకి 2లక్షల పైన ఓట్లు రావడం,BRS అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత ఉండడం వల్ల బీజేపీకి ఈ సీటు ఈసారి దక్కే అవకాశం ఉంది.రఘునందన్ రావుకి మంచి వక్తగా, విషయ పరిజ్ఞానం ఉన్న నాయకుడిగా,బీజేపీ కూడా బలంగా తయారుకావడం,మోడీ చరిష్మా బలంగా ఉండడం వల్ల తప్పకుండా రఘునందన్ రావు ఇక్కడి నుంచి గెలవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోందని చెప్పొచ్చు..
చివరగా వరంగల్ లో 1984లో మొదటిసారి బీజేపీ గెలిచిన 2 ఎంపీల్లో ఒకటి వరంగల్ నుండే జంగారెడ్డి గారు గెలిచిన విషయం తెలిసిందే.
మళ్ళీ 40 ఏళ్ల తర్వాత బీజేపీ వరంగల్ పార్లమెంట్ లో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నది.
ఇక్కడ బీజేపీ గెలవడానికి చాలా అంశాలు కలిసివస్తున్నాయి.
BRS నుంచి టికెట్ ప్రకటించబడిన కడియం శ్రీహరి కూతురు కావ్య BRS నుంచి పోటీ తప్పుకోవడం కాంగ్రెస్ లో చేరడం BRSకి పెద్ద మైనస్..కడియం శ్రీహరి,కావ్య కాంగ్రెస్ లో చేరడం కాంగ్రెస్ శ్రేణులకు నచ్చకపోవడం,చాలామంది కార్యకర్తలు నిరసనలు చేయటం చూస్తే కాంగ్రెస్ ఎంతమేరకు ఈ గ్యాప్ పూరిస్తుందనేది చూడాలి..
ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అరూరీ రమేష్ కావడం వల్ల పోటీ రసవత్తరంగా మారింది.
కాంగ్రెస్,బీజేపీ మధ్యనే పోటీ ఉండనున్నది.బీజేపీ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఓట్లు రాబట్టినందున ఇక్కడ మంచి అవకాశం బీజేపీకి ఉన్నది.
హైదరాబాద్ నగరం తర్వాత అర్బన్ ఓటు బ్యాంక్ బలంగా ఉన్న నియోజకవర్గం వరంగల్ కావడం,మోడీ అనేక వేలకోట్లు అభివృద్ది పనులు చేయడం,ములుగు గిరిజన యూనివర్సటీ,రామప్ప యునెస్కో గుర్తింపు, కాజీపేట రైల్వేకోచ్ వ్యాగెన్ ఫ్యాక్టరీ ఇవ్వడం,వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మించడం,స్మార్ట్ సిటీ, అమృత్ సిటీ ఇలా అనేక ప్రాజెక్టులతో మోడీపై ప్రజల్లో ఆదరణ కనిపిస్తుంది.ఈ లెక్కన 40 ఏళ్ల తర్వాత బీజేపీ వరంగల్ లో గెలవనున్నది అనేది విస్తృత ప్రచారం జరుగుతున్నది..
పెద్దపల్లిలో,హైదరాబాద్ లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.ఈసారి ఓవైసీపై అనూహ్యంగా బీజేపీ ఏమైనా వండర్స్ క్రియేట్ చేయనుందా అని అంతా అనుకుంటున్నారు..
(వ్యక్తిగత అభిప్రాయం)
నరెడ్ల ప్రవీణ్ రెడ్డి
S
Good job
ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, హైదరాబాద్ తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో BJP కే విజయ అవకాశాలు ఎక్కువ…
పైన పేర్కొన్న నియోజకవర్గాల్లో సైతం గతంతో పోల్చితే గణనీయమైన ఓటు బ్యాంక్ సాధించడమే కాకుండా రెండవ స్థానంలో నిలుస్తుంది…
మొత్తానికి తెలంగాణలో పోటీ మాత్రం BJP, కాంగ్రెస్ ల మధ్యనే అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది…
గ్రామీణ ప్రాంతాల ఓటర్లు సైతం ఈ ఎన్నికల్లో మోడీకే ఓటు వెయ్యబోతున్నారు…
రానున్న రోజుల్లో BJP, కాంగ్రెస్ ల మధ్య రసవత్తర రాజకీయ పోరుకు తెలంగాణ వేదిక కానున్నది….