కాంగ్రెస్ కి షాక్..రాహుల్ దోస్త్ జంప్!

కాంగ్రెస్ కి షాక్..బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత..

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్‌ విజేందర్ సింగ్ నేడు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ లో చేరాడు.

ఈ లెక్కన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి..ఒక్కొక్కరిగా ఆ పార్టీ నుంచి జంప్ అవుతున్నారు.

ఒకవైపు సర్వేలన్నీ మళ్ళీ వచ్చేది మోడీ సర్కారేనని ఘంటాపథంగా చెబుతున్న తరుణంలో కాంగ్రెస్ కి భవిష్యత్ లేదని జారుకుంటున్నారు..

దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర,భారత జోడో న్యాయ యాత్ర పేరుతో తిరిగినా కార్యకర్తల్లో విశ్వాసం నింపలేకపోయారు..

రాహుల్ గాంధీ కోర్ టీమ్ గా పిలవబడే నేతలే పార్టీ మారుతున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..ఇప్పటికే కాంగ్రెస్ అధికారం కోల్పోయి 10 ఏళ్లు అవుతుంది.మళ్ళీ వచ్చే పరిస్థితి లేదని గ్రహించి అందరూ జంప్ అవుతున్నారు.

విజేందర్ సింగ్ 2009 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మరియు 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాలు ,అలాగే 2006 మరియు 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాలను కూడా గెలుచుకున్నాడు..

ఈ మధ్యకాలంలో మహిళా రెజ్లర్స్ చేసిన ఉద్యమంలో వారికి సపోర్టుగా నిలిచాడు.అనతికాలంలోనే ఆ మహిళా రెజ్లర్స్ చేసిన ఉద్యమం రాజకీయ ప్రేరేపితమైనదని తెలుసుకున్న చాలా మంది ఆ ఉద్యమం నుంచి తప్పుకున్నారు.

ఈ క్రమంలోనే విజేందర్ సింగ్ బీజేపీలో చేరడం కాంగ్రెస్,ఇండి కూటమికి ఎదురు దెబ్బే!

జై హింద్!

One thought on “కాంగ్రెస్ కి షాక్..రాహుల్ దోస్త్ జంప్!

  1. It is correct decision by Mr. Vijender Singh. It is high time every Indian should support BJP and recognise the relentless hard work by honourable Prime Minister’s Shri. Narendra Modi, undoubtedly he is emissary of God.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *