ABVP ఉచిత ఎంసెట్ కోచింగ్!!

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎంసెట్ ఉచిత శిక్షణ తరగతులు..

ABVP అంటే కాగడా జెండా పట్టే విద్యార్థులే గుర్తొస్తారు.
ABVP అంటే సమస్యలపై ఉద్యమించే పోరగాల్లే కనిపిస్తారు.
ABVP అంటే ధర్నా,రాస్తారోకో లు మాత్రమే చేస్తారు అనుకుంటారు.. కాలేజీకి బంద్ కావాలి అని కాల్ చేస్తుంటారు..
ABVP అంటే ఎప్పుడూ ఇలాగే,ఇదేనేమో అనుకుంటారు..
కానీ
ABVP అంటే దేశభక్తిని నింపే జాతీయవాద శక్తి..
ABVP అంటే సామాన్య విద్యార్థులను నాయకులుగా తీర్చిదిద్దే శక్తి..
ABVP అంటే ఆపదల్లో రక్తం ఇచ్చే బ్లడ్ బ్యాంక్..
ABVP అంటే సైనికులకు సపోర్ట్ గా నిలిచే దేశభక్తి గ్యాంగ్..
ABVP అంటే సామాజిక సేవా సంస్థ..
ABVP అంటే పేద విద్యార్థులకు అండా దండ..

ఇలాగే వరంగల్ లో పేద విద్యార్థుల కోసం,డబ్బులు పెట్టి కోచింగ్ లు తీసుకోలేని వాళ్ళ కోసం ఉచితంగా ఎంసెట్ కోచింగ్ ఇస్తూ అండగా నిలుస్తున్నది..

సామా జగన్ మోహన్ మెమోరియల్ ట్రస్ట్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో హనుమకొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత ఎంసెట్ శిక్షణ తరగతులు ప్రారంభించింది.

ప్రతిభగల ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఎంసెట్ లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా ఈ ఉచిత ఎంసెట్ తరగతులను ఉదయం 8.30 నుండి సాయంత్రం 6.30 గంటల వరకు సామ జగన్మోహన్ ట్రస్ట్ భవన్(ABVP ఆఫిస్), బాలసముద్రంలో తరగతులు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల నుండి ప్రతిభగల పేద,మధ్యతరగతి విద్యార్థులు ఈ ఉచిత శిక్షణ తరగతులను వినియోగించుకోవడం జరుగుతుంది. ఉన్నత విద్యపై ఆసక్తి ఉన్నా..కోచింగ్ సెంటర్లకు డబ్బు కట్టలేని విద్యార్థులు అత్యున్నతమైన ఇంజనీరింగ్ మరియు డాక్టర్ చదువుకై ఈ ఎంసెట్ కోచింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

తమ కలలు ఈ ఉచిత శిక్షణ ద్వారా ఎంతో కొంత వారికి ఉపయోగపడుతుందని,వారికోసమే ఈ ఫ్రీ కోచింగ్ నిర్వహించడం జరుగుతుందని ఈ తరగతులను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ABVP నేతలు కోరుతున్నారు.

జై హింద్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *