భారత ప్రభుత్వం దీనదయాల్ ఏకాత్మ మానవ దర్శనం తాత్విక సిద్ధాంతం ఆధారంగా అంత్యోదయ విధానం క్రింద నిరుపేదలకు ఉజ్వల యోజన ద్వారా పేదవారికి గ్యాస్, జన్ ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్ యోజన ద్వారా పేదవారికి ఇండ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ల నిర్మాణం, మారుమూల ప్రాంతాలకు దీన్ దయాల్ గ్రామ జ్యోతి యోజన ద్వారా ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా, దీన్ దయాల్ కౌశల్ యోజన ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది.

సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందరికీ తను నిర్దేశించిన లక్ష్యాల ఫలాలు అందించాలని భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది. ఆత్మనిర్బర్ భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి స్వయం ఆధారిత భారత్ ప్రపంచంలో మేటిగా ఎవరిపై ఆధారపడకుండా ఆర్థిక వ్యవస్థ (Economy), మౌలిక సదుపాయాలు (Infrastructure) సాంకేతికత( Technology driven system), జనాభా(Demography), గిరాకి (Demand) ఇలా అన్ని రంగాలలో స్వశక్తిగా ఎదగడం కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రధాన మంత్రి సడక్ యోజన ద్వారా పట్టణాల రహదారుల (ఆవాసాలు) నుండి అన్ని గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించడంతో అన్ని రంగాలలో మెరుగైన పంపిణీ, సేవలు, సౌకర్యాలు, ఉపాధి అవకాశాలతో అభివృద్ధికి దోహదం చేస్తుంది.
సమాజంలో ఆడ పిల్లలకు సమాన అవకాశాలు, ఉద్యోగాలు, ఉన్నతమైన చదువు అందించాలని, భ్రూణ హత్యల నిర్మూలన మరియు స్త్రీ సాధికారత కోసం “బేటీ బచావో బేటి పడావో” నినాదంతో పథకం తెచ్చి, దీనిలో భాగంగానే బాలికల కోసం “సుకన్య సమృద్ధి యోజన” పథకాన్ని ప్రారంభించారు. భారత ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను అమలుపరుస్తుంది.

గరీబ్ కళ్యాణ్ పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఆహారం, వంటగ్యాస్ మొదలైన ప్రాథమిక అవసరాలు తీర్చి సదుపాయాలు కల్పిస్తుంది. విశ్వకర్మల నైపుణ్యాలకు గౌరవం కల్పిస్తూ దేశవ్యాప్తంగా చేతివృత్తులు, సంప్రదాయ కళలతో జీవనం సాగిస్తున్న విశ్వకర్మలకు ఆర్థికసాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ”పీఎం విశ్వకర్మ” అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పండిట్ దీనదయాల్ తాత్విక సిద్ధాంతాల పునాదుల మీద ఈరోజు భారత్ స్వశక్తి, స్వాభిమానం, ఆత్మనిర్బర్ భారత్ గా ప్రపంచంలోనే ఐదవ ఆర్దిక శక్తిగా ఎదిగింది.
భారతీయ తత్వం ఆధారంగానే ఈ ఏడాది భారత్ అధ్యక్షతన నిర్వహించిన జీ-20 ద్వారా విశ్వం అంతా ఒకే కుటుంబం భావనతో “వసుధైక కుటుంబం” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సమ్మిట్‌ను నిర్వహించింది. ఈ ట్యాగ్ లైన్ ద్వారా భారత్ యావత్ ప్రపంచానికి ఏకతా సందేశాన్ని పంపింది.
ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు వాతావరణంలో మార్పులు, ఉగ్రవాదం మరియు మహమ్మారి ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న వేల ఒకరితో ఒకరు పోరాడడం ద్వారా సాధించేది ఏమీలేదు, కలిసి పని చేయడం ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చు అని జీ20 ప్రెసిడెన్సీ ద్వారా చెప్పి మన భారతీయ తత్వచింతన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేశారు.

అదేవిధంగా మన ఒకే భూమికి స్వస్థత చేకూర్చడం, మన ఒకే కుటుంబంలో సామరస్యాన్ని సృష్టించడం, మరియు మన ఒకే భవిష్యత్తుపై ఆశలు కల్పించడంపై దృష్టి సారించడం మన దూరదృష్టికి నిదర్శనం. భారతదేశం ఇలా సార్వత్రిక ఏకత్వం యొక్క భావాన్ని ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఇంటిగ్రల్ హ్యూమనిజం సిద్ధాంతం ద్వారానే భారత్ విశ్వ గురువుగా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలకు తప్పకుండా దిశా నిర్దేశం చేస్తుంది.
వ్యాసకర్త
-డా. శ్రీశైలం వీరమల్ల
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇగ్నో (IGNOU), న్యూ ఢిల్లీ.
ఫోన్: 9912342434
Modiji కాక పోతే ikkevvadu only bjp Only modiji 🚩🙏🙌
Good Information, nice Article
Good information nice artical beata.
Jai shree ram