కొత్త కొత్తగా ఆశలు చిగురించాలి..
కొత్త కొత్తగా ఆశయాలు ఉదయించాలి..
కొత్త కొత్తగా ప్రయాణాలు మొదలవ్వాలి..
కొత్త కొత్తగా మలుపులు గెలుపవ్వాలి..

కొత్త కొత్తగా సాహసాలను ఎదుర్కోవాలి..
కొత్త కొత్తగా కష్టాలను ఛేదించాలి..
కొత్త కొత్తగా లక్ష్యాలను చేరుకోవాలి..
కొత్త కొత్తగా నేస్తాలను చేర్చుకోవాలి..
కొత్త కొత్తగా అనుభవాల్ని ఆకాంక్షించాలి..
కొత్త కొత్తగా అనుభూతులను ఆస్వాదించాలి..
కొత్త కొత్తగా సంఘర్షణలను ఎదుర్కోవాలి..
కొత్త కొత్తగా జీవితాన్ని మలుచుకోవాలి..

కొత్త కొత్తగా ఈ నూతన సంవత్సరాన్ని గెలుచుకోవాలి..
ఆరు రుచుల ఉగాదిలా..మీ జీవితం కూడా ఆనందంగా సాగాలని కోరుకుంటూ శ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు…జై శ్రీరామ్ 🚩
Happy ugadi