తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా సుత్తి లేకుండా కొన్ని ప్రశ్నలు..
అవకాశం ఇవ్వండి..అధికారం ఇవ్వండి..
మార్పు రావాలి..కాంగ్రెస్ రావాలి అని అడిగితే జనాలు పువ్వుల్లో పెట్టి అధికారం ఇచ్చారు.
6 గ్యారెంటీలు 100రోజుల్లో అమలు చేస్తామన్నారు..
వంద పోయి 130 రోజులు దాటినా సగం హామీలు కూడా అమలు చేయలేకపోయారు..
మరి ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని..
మీరు అన్న మాటలు ఉత్తవేనా?
గెలవడం కోసం,అధికారం కోసం ఎన్ని అబద్ధాలు అయినా చెప్తారా? అడ్డగోలుగా హామీలూ ఇస్తారా?
ఇప్పుడు కొత్తగా జనాలకి కండిషన్ లు పెడుతున్నారా?
2 లక్షల ఋణమాఫీ ఆగస్టు 15లోపు కావాలంటే మీ కాంగ్రెస్ పార్టీకి 14 ఎంపీ సీట్లు గెలిపించాలా?
ముదిరాజ్ నుంచి ఒకరు మంత్రి కావాలంటే కచ్చితంగా 14 సీట్లు గెలిపించాలా?
క్వింటాల్ కి 500 బోనస్ ఇవ్వాలంటే 14 సీట్లు ఇవ్వాలా?
2500 మహిళలకు,15000 రైతులకు,12000 రైతు కూలీలకు,4000 నిరుద్యోగ భృతి యువతకు,తులం బంగారం,స్కూటీ మహిళలకు,7800 కోట్లు ఫీజ్ రీయింబర్స్ మెంట్ విద్యార్థులకు,4000 పింఛన్ వయో వృద్దులకు ఇవ్వాలంటే మీకు 14 సీట్లు గెలిపిస్తేనే చేస్తారా?
గెలిపించకపోతే చేయరా? ఇయ్యరా?
బంగారు పళ్లెంలో పెట్టి అధికారం అప్పచేపితే రోజుకో ముచ్చట చెప్పి కాలం గడుపుతూ చెప్పిన,ఇచ్చిన హామీలకు ఇప్పటివరకు దిక్కులేదు..
పార్లమెంట్ ఎన్నికల లోపు హామీలు అమలు చేసి గెలిపించమని అడిగితే తప్పకుండా జనం ఆలోచించే వారు..
కానీ ఒక్క ఉచిత బస్సు,గ్యాస్ 500కే తప్ప ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు చేయలేకపోయారు..
ఇప్పుడు 14 సీట్లలో గెలిపిస్తెనే హామీలు అమలు చేస్తామని మరోసారి మభ్యపెడుతున్న మీకు జనం ఎందుకు ఓటేయాలో సమాధానం చెప్పండి?
నరెడ్ల్ ప్రవీణ్ రెడ్డి
జై హింద్!
Rithilakey kadha .karporet laku kadhukadha rithulaku Runa maphi cheyanude