సామ జగన్మోహన్ రెడ్డి అచంచల దేశభక్తుడు
ఇంటికి ఒక్క కొడుకు..మధ్యతరగతి కుటుంబం..
చదువులో సరస్వతి పుత్రుడు..అందరికీ మిత్రుడు..
ధైర్యవంతుడు..శౌర్యవంతుడు.. విజ్ఞానవంతుడు..

దేశమంటే ప్రేమ,భక్తి,గౌరవం..దేశమంటే ప్రాణం…
ABVP లో నేర్చుకున్న దేశభక్తి నినాదాలు..వేదాలుగా
ఘన చరిత్ర సాక్షిగా భారత పునర్వైభవమే లక్ష్యంగా
కాకతీయ యూనివర్సిటీలో పాతుకుపోయిన RSU,
నక్సలైట్, కమ్యూనిస్టులను ఎదుర్కొన్న ధీశాలి..
తుపాకీ ఎక్కుపెట్టి చంపుతామన్న బెదరని ధైర్యశాలి.
RSU,నక్సలైట్ దేశద్రోహులు జనవరి 26న ఎగరేసిన
జాతీయ జెండాను దించేసి నల్లజెండా ఎగరేసి మళ్ళీ దమ్ముంటే మీ జాతీయజెండాను ఎగరేయమని సవాల్ విసిరితే..
అక్కడే ఉన్న యూనివర్సిటీ అధికారులు,పోలీసులు భయపడిన వేళ..

చావును సైతం ధిక్కరించి,సవాల్ ని వెక్కిరించి మన జాతీయజెండా గౌరవం కోసం..జాతి పరువుకోసం..
మళ్ళీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకున్న వీరుడు..

RSU గుండాలపై పడిన ఈ దేశద్రోహ నేరానికి సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరూ ముందుకు రాని వేళ
తానే స్వయంగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడిన వేళ
కేసుకు భయపడిన పిరికిపందలు మాటు వేసి వెంబడించి ముందు నుండి చంపే ధైర్యం లేని పిరికిపందులు వెనకాల నుంచి కత్తితో పొడిచి 36సార్లు కత్తిపోట్లకి అమరుడైన వీరుడు జగనన్న..

దేశ స్వాతంత్రం తర్వాత దేశం కోసం,జాతీయ జెండా కోసము అసువులు బాసిన మొదటి వ్యక్తి..
జగనన్న మీరే మాకు రియల్ హీరో..మీరే మాకు స్ఫూర్తి..

ఆయన వర్ధంతి సందర్భంగా మీకివే మా నివాళులు..జోహార్ జగనన్న…

Jai hind JOHAR జగనన్న