వెక్కిరించిన చోట..మొఖం మీద నవ్విన చోట..
గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వని చోట..బుక్కెడు బువ్వ పెట్టని చోట..
ఎగతాళి చేసిన చోట…ఎటకారం ఆడిన చోట..
భారతదేశాన్ని తక్కువ చూపు చూసిన చోట..
భారతధర్మాన్ని లోకువ చేసి కాకుల్లా వాగిన చోట..
చికాగోకు అడుగు పెట్టనివ్వని చోట..చిత్రవిచిత్రంగా చూసిన చోట..
ప్రపంచ మత మహాసభల్లో వందలమంది పాస్టర్లు.. మేధావులు..పండితులు..చిన్నచూపు చూసిన చోట
రెండు నిమిషాల్లోనే ఏదోటి మాట్లాడి పో అన్నట్టు కసిరిన చోట..
ఒక్క పదం..ఒక్కటే వాక్యం..అదే అదే భారతీయ నాదం..వేదం..
సోదర సోదరీమణులారా…
అది ఇక ఉపన్యాసం కాదు..ఎక్కడా చప్పట్లు ఆగలేదు..గంగా ప్రవాహంలా గలగలా పారుతున్నట్టే..
ఆకాశమంతా, భూగోళామంతా చెవులు రిక్కరించుకొని విన్నట్టుగా..ఆ ప్రవాహానికి అడ్డు చెప్పేవారు..అడ్డుకట్ట వేసే వారు లేరు..
సనాతన ధర్మం ముందు..నా దేశం ముందు..
ఏ ధర్మం ఏ దేశం నిలవదని…వేసుకునే బట్టల్లో గౌరవం లేదని మా భారతదేశమంటేనే గౌరవం అని గర్వంగా గర్జించిన చోట చికాగో పావనమైంది..
వెక్కిరించిన వాళ్లే.. ఆహ్వానించారు..నవ్వినవాళ్లే నవ్వులపాలు అయ్యారు..చికాగో నగరమంతా స్వామీజీకి జయ జయ ద్వానాలు..జనమంతా జేజేలు…
ప్రపంచానికి భారతదేశాన్ని గొప్పగా చూపెట్టి భారతాన్ని సగర్వంగా నిలబెట్టిన స్వామి వివేకానందుడి గర్జన నేటికి వినిపిస్తూనే ఉంది..131 ఏళ్ళైనా దేశాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంది..
జయహో వివేకవాణి..🙏జయ జయహో భారతభూమి🚩
నాస్పందన #స్వామివివేకానంద #చికాగోఉపన్యాసం #సెప్టెంబర్11th #131ఏళ్ళు
