అత్యంత నిజాయితీపరుడు రైతన్న!!

ప్రపంచంలో..
ఎవరిని మోసం చేయకుండా..ఎవరిని ముంచకుండా..
ఎవరిని ఇబ్బంది పెట్టకుండా..ఎవరిని భయపెట్టకుండా..
ఎవరిని దోపిడీ చేయకుండా..ఎవరికి ద్రోహం చేయకుండా..
ఎవరికి ఆశ పడకుండా..ఎవరిపై ఆధారపడకుండా..
రూపాయి పెట్టుబడి పెట్టి 10 రూపాయలు సంపాదించి..
వందకు కొని వెయ్యికి అమ్ముకునే వ్యాపారం నుంచి..
ప్రపంచంలో ఎన్నో రంగాలు ఎంతో కొంత ప్రజల్ని మోసం చేసి లాభం పొంది కోట్లకు పడగలెత్తేవాళ్లే…
కానీ భూమితల్లిని నమ్ముకొని,కష్టాన్ని నమ్ముకొని
రెక్కలుముక్కలు చేసుకొని,దుబ్బకి,దుమ్ముకి,ఎండకి వానకి,కష్టానికి,నష్టానికి తట్టుకొని ప్రపంచానికి తిండిపెట్టేది ఒకే ఒక్కడు రైతన్న..

అందుకే ప్రపంచంలో
అత్యంత నిజాయితీ పరుడు..అత్యంత నిస్వార్థపరుడు..
అత్యంత ఆత్మాభిమానం కల..అత్యంత మంచివాడు..
కష్టం..సుఖం..లాభం..నష్టం.. ఏవి ఎన్నున్నా..
ఎప్పటికీ.. ఎన్నటికీ.. రైతేరాజు..

3 thoughts on “అత్యంత నిజాయితీపరుడు రైతన్న!!

  1. “ప్రపంచ వ్యాప్తంగా, చాలా మంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం మోసం, తారుమారు మరియు దోపిడీలో మునిగిపోతారు. కానీ ఈ గందరగోళం మధ్య, ఒక గొప్ప ఆత్మ ఉంది – ఒక రైతు. వారు భూమిని శ్రమిస్తారు, కష్టాలను భరిస్తారు, ప్రతి సవాలును దృఢంగా ఎదుర్కొంటారు. ఆనందం నుండి దుఃఖం వరకు , లాభానికి నష్టానికి, వారు ప్రపంచానికి జీవనోపాధిని అందిస్తారు. వారిది అత్యంత సత్యం, నిస్వార్థం, గౌరవం మరియు మంచితనం. మందపాటి మరియు సన్నగా ఉండటం ద్వారా, వారు భూమికి నిజమైన రాజులుగా మిగిలిపోతారు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *