సమాచారం కోరడం ఎలా?
సమాచార చట్టం-2005 ప్రకారం మీరు ఏ పబ్లిక్ అథారిటీనుంచి అయినా
సమాచారం కోరవచ్చు (పబ్లిక్ అథారిటీ అంటే ప్రభుత్వ సంస్థ, లేదా, ప్రభుత్వ
ఆర్ధిక సహాయంతో నడిచే సంస్థ) దరఖాస్తు ఫారాన్ని వ్రాయాలి, లేదా టైప్ చేయాలి.
దరఖాస్తు ఇంగ్లీషు, హిందీ, లేదా ఏదైనా రాష్ట్రానికి చెందిన భాషలోనే వుండాలి
మీ దరఖాస్తులో ఈ కింది సమాచారాన్ని తెలియజేయండి
సహాయ పౌర సమాచార అధికారి (ఏ పి ఐ ఓ) /
పౌర సమాచార అధికారి (పి ఐ ఓ) పేరు ,
కార్యాలయం చిరునామా
విషయం: దరఖాస్తు-సమాచార చట్టం-2005 సెక్షన్ 6(1) ప్రకారం
పబ్లిక్ అథారిటీనుంచి మీకు కావలసిన సమాచారం వివరాలు
దరఖాస్తుదారు పేరు
తండ్రి / భర్త పేరు
కేటగిరి: ఎస్సి / ఎస్టి / ఓబిసి
దరఖాస్తు రుసుము
మీరు పేద (బిపిఎల్) కుటుంబానికి చెందినవారా? అవును / కాదు
మీ పోస్టల్ చిరునామా, మొబైల్ ఫోన్ నంబరు, ఇ-మెయిల్ ఐడి
(అయితే, ఇ-మెయిల్ ఐడి ని పేర్కొనడం తప్పనిసరి కాదు)
తేదీ, ఊరు
దరఖాస్తుదారు సంతకం
జతపరుస్తున్న పత్రాల జాబితా
దరఖాస్తు దాఖలుచేసే ముందు సహాయ పౌర సమాచార అధికారి /
పౌర సమాచార అధికారి పేరు, నిర్దేశించిన సుంకం, చెల్లించవలసిన
తీరు సక్రమంగా వున్నది లేనిది సరిచూసుకోండి
సమాచార హక్కు (ఆర్టి ఐ) చట్టం కింద, సమాచారం పొందడానికి దరఖాస్తు
రుసుం చెల్లించవలసి వుంటుంది. అయితే, ఎస్ సి / ఎస్ టి / బి పి ఎల్ కుటుంబాలకు చెందినవారికి సుంకంనుంచి మినహాయింపు వుంది. సుంకం మినహాయింపుకోరేవారు ఎస్ సి / ఎస్ టి / బి పి ఎల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని జతచేయవలసి వుంటుంది.దరఖాస్తును స్వయంగా, లేదా పోస్టు ద్వారా, లేదా ఇ-మెయిల్ ద్వారానైనా పంపవచ్చు.పోస్టుద్వారా పంపదలచుకుంటే, రిజిస్టర్డ్ పోస్టుద్వారానే పంపాలి. దరఖాస్తు పత్రాలకు (అంటే, దరఖాస్తు ఫారము, సుంకం చెల్లింపు రసీదు, స్వయంగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు సమర్పించినట్టు రసీదు) రెండు జిరాక్స్ కాపీలు తీయించుకుని తర్వాతిఅవసరాలకు వీలుగా మీ వద్ద వుంచుకోండి.
మీరు స్వయంగా దరఖాస్తు అందజేస్తుంటే, ఆ కార్యాలయంనుంచి రసీదు తీసుకోండి.ఆ రసీదుపై తేదీ, ఆ కార్యాలయం ముద్ర స్పష్టంగా వుండేలా జాగ్రత్త వహించండి.దరఖాస్తును పోస్ట్ ద్వారా పంపదలచుకుంటే, దానిని రిజిస్టర్డ్ పోస్ట్లో పంపి ఆ రసీదునుభద్రంగా వుంచుకోండి ఆ దరఖాస్తు పౌర సమాచార అధికారికి అందిన తేదీనుంచి ,సమాచారం అందజేయడానికి గడువును లెక్కించడం జరుగుతుంది.