తిట్టిన తిట్టు తిట్టకుండా కేసీఆర్ ని తిట్టిన RS ప్రవీణ్ కుమార్ అదే కేసీఆర్ తో చేయి కలిపి పొత్తు పెట్టుకున్నాడు..అన్ని విషయాల్లో వ్యతిరేకించిన కేసీఆర్ ని ఆలింగనం చేసుకున్నాడు.కేసీఆర్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు.కేవలం ఎటు చేసి పదవుల్లో ఉండాలనే తాపత్రయం ఏమో ఎంపీ సీట్ కోసం బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి..ఏమైందో ఏమో కానీ హఠాత్తుగా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు..
రాజీనామా కారణం చూస్తే మాత్రం చాలా సిల్లీగా ఉంది.కవిత అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ బీఎస్పీ కి రాజీనామా చేయడం మాత్రం హాస్యాస్పదంగానే ఉంది..
ఇదే RS ప్రవీణ్ కుమార్ గారూ 2023లో అన్ని ఆధారాలు ఉన్నా కవితని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించి ఇప్పుడు మాత్రం మోడీ, ఈడీలను అడ్డు పెట్టుకొని కవితను అరెస్ట్ చేయడం బూటకం,నాటకం అని మళ్ళీ ట్వీట్ చేయడం కేవలం రాజకీయ అవసరాల కోసమేనని తెలుస్తుంది.
రాజకీయాల్లో హత్యలు ఉండవు..ఆత్మహత్యలే ఉంటాయంటే ఈ ఉదంతమే ఉదాహరణ.

వీడు ఒక వెస్ట్ గాడు.. వీడికి values తేల్వదు