అసలు మీడియా చేయాల్సిన పని ఏమిటి ?

నాస్పందన మీడియా రీల్ Vs రియల్

మన దేశంలో మీడియా దేనికుందో దాని లక్ష్యాలేందో.
పొద్దున లేస్తే కాంట్రవర్సీ కావాలి,తిప్పితిప్పి దాన్నే చూపించాలి..
దేశంలో ఏ సమస్య లేనట్టు…
మందు తప్పతాగి పట్టుబడ్డ సెలెబ్రిటీ ని రోజుకు వెయ్యి సార్లు చూపిస్తారు…


అదే రైతు అప్పులు భరించలేక పురుగుమందు తాగితే దాన్ని ఒక్కసారి మొక్కుబడికి చూపిస్తారు..పెద్దగా పెట్టుబడి రాదుగా..డబ్బులు రావుగా..
దేశానికి ఉపయోగపడే సినిమాలు తీయడం చాతకానీ చెత్త డైరెక్టర్,హీరోలతో గంటలు గంటలు సొల్లు పెడుతుంటారు…
దేశానికి నిస్వార్థంగా సేవచేసిన వారికి ఈమధ్య పద్మశ్రీ లు వస్తే ఒక్క గంట కూడా చర్చ పెట్టరు…
రోడ్డుపైన అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ అయితే పొద్దంతా పొద్దుపోయేదాకా బతికేవాన్ని కూడా చావగొట్టేటట్టు చావగొడుతుంటారు..


అదే దేశంకోసం శత్రువులతో పోరాడి చనిపోతే కనీసం నివాళిగా సైనికుల త్యాగాన్ని జనాలకు అర్థమయ్యేలా ఎందుకు చూపెట్టలేరు.అవసరం లేదా
పనికిరాని వంటలకు,పగటిపూట ఫోన్ కొట్టు చీర పట్టు అంటూ సోది పెట్టేబదులు పనికివచ్చే కార్యక్రమాలే లేవా? ఎవరికి వంట రాదని? అదో పెద్ద అంతర్జాతీయ సమస్యనా?
అధికార పార్టీపై ప్రతిపక్షాల చేసే ఆరోపణల కోసమేనా మీడియా ఉన్నది..
ప్రభుత్వం తెచ్చిన పథకాలకు అవగాహన కల్పించొచ్చు కదా?
కత్తి మహేష్ తో సుత్తి కబుర్లు…రాం గోపాల్ వర్మతో గాలి ముచ్చట్లు…ఎవరికి అవసరం..అత్యవసరం?
రోజులో 24 గంటలు కదా ఒక్కగంట రోజు దేశభక్తిపైన
ఒక్క కార్యక్రమం చూపెట్టలేరా? దేశభక్తుల పోరాటాన్ని,వారి త్యాగాన్ని గుర్తుచేయలేరా?
స్వామి వివేకానంద కు బదులు నిత్యానంద ను హైలెట్ చేస్తారు..
భగత్ సింగ్ కి బదులు బాహుబలి గురించి మాట్లాడతారు…
ఎవడి సినిమాకి ఎన్ని కోట్లు వస్తే మీకేంటి?మాకేంటి?
రైతులను పార్టీలు పట్టించుకోక,ప్రభుత్వాలు పట్టించుకోక,సమస్యలను మీరు(మీడియా) కూడా పట్టించుకోకపోతే మీ మీడియా ఎవరికోసం,ఎందుకోసం పనిచేస్తున్నట్టు..
ఏది వైరల్ ఏది రియల్ అనేదానికి బదులు ఇది ప్రాబ్లమ్..ఏది సొల్యూషన్ అని రోజుకు వందసార్లు కాకపోయినా ఒక్క పదిసార్లు అడిగినా దేశము బాగుపడుతుంది.. ఇప్పటికైనా మారండి..లేదా మీరు కూడా బ్రోకర్ల బతుకులు బతకండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *