తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
Apr 10, 2025,
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలోని పలు జిల్లాలో గురువారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, హనుకొండ, వరంగల్, జనగాం, మహబూబ్‌బాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.