తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక పెళ్లిలో జరిగిన సంఘటన వార్త వైరల్ అవుతుంది..
విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తులం బంగారం స్కీమ్ కోసం మహిళలు చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించిల్లు..అయితే ప్రభుత్వ వచ్చి సంవత్సరం దాటినా ఆ స్కీమ్ అతీగతీ లేదు..
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా అనే గ్రామంలో పెళ్లి మండపం లో వధూవరులు,కుటుంబ సభ్యులు తులం బంగారం హామీ ఏమైంది అని వినూత్న నిరసన తెలియజేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శించగా ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది…రేవంత్ రెడ్డి సర్కార్ పై వ్యతిరేకత పెరుగుతున్నది..ఈ సందర్భంగా ఈ విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు..మీరేమంటారు ఈ వార్తపై?
తులం బంగారం కోసం పెళ్లిలో నిరసన
