ఎవరన్నారు నువ్వు చనిపోయావని…
ఎవరన్నారు నువ్వు కనుమరుగయ్యావని..
ఎగిరే ప్రతీ జాతీయజెండా ఎక్కడ కనిపించినా నువ్వే గుర్తుకొస్తావు..
మోగే జాతీయగీతం ఎప్పుడు వినిపించినా నువ్వే కనిపిస్తావు..

కాగడా జెండా పట్టిన ప్రతీ కార్యకర్త గుండెల్లో నిలిచినావు..
దేశమంతటా జాతీయవాద సిద్ధాంతమై కొలిచినావు..
కంచుకోట అని విర్రవీగిన కమీనే గాళ్ల బలుపులను బద్దలు కొట్టావు.
దొంగచాటుగా వచ్చి నీ కడుపులో కత్తిదూసిన సుత్తి కొడవలి గాళ్ళు వందలు వసూల్ చేసే చందాగాళ్లుగా మార్చావు..

ఇక ఉస్మానియా జార్జ్ గాళ్ళు ఎప్పటిలాగానే బూర్జువాలంటూ ఏడవసాగారు..
చైనా చెంచాలు చారిత్రక తప్పులు లెక్కపెడుతున్నారు..
నువ్వు నిలదీసి తరిమికొట్టిన ఎర్రిజెండాలు మసిగుడ్డల్లా మాసిపోయాయి..
నువ్వు నిలబడి ఎగరేసిన జాతీయజెండాలు ముసిముసి నవ్వుల్లా మురిసిపోయాయి..
నువ్వు ఎగరేసిన జాతీయజెండా ఆకాశాన్ని తాకలేదేమో గానీ..
నువ్వు చేసిన ధైర్యం,త్యాగం,నువ్వు ఇచ్చిన స్ఫూర్తి,నీ ప్రతిరూపం ఆకాశమంత ఎత్తున నిలిచింది..
చంద్రుని పక్క చుక్కల్లా..
చరిత్ర ఉన్నంతవరకు. ధరిత్రి ఉన్నంతవరకు..నీ బలిదానం..నీ ఆశయం మాకెప్పటికి స్ఫూర్తినిస్తూనే ఉంటది.. జోహార్ జగన్ అన్న..జోహార్ జోహార్..!