ఆపరేషన్ కగార్ అంటే కమ్యూనిష్టులు ఎందుకంత పరేషాన్ అవుతున్నారు? ఇన్నేళ్లుగా మీరు చేసిన నరమేధం సంగతి ఏంటి? మీరు చంపిన,చంపించిన సాధారణ ప్రజల చావుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా?
పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ కూడా నక్సలైట్లకు వంతపాడడం ఎంత వరకు సమంజసం? పోలీసులను చంపినపుడు పోలీసుల పక్షాన ఎప్పుడైనా మాట్లాడారా? మీ రక్షణ కోసం,రాష్ట్ర ప్రజలు రక్షణ కోసం తమ విధి నిర్వహణ చేస్తున్న పోలీసులను చంపిన,చంపుతున్న నక్సలైట్లకు వత్తాసు పలకడం సిగ్గుచేటు!
నక్సలైట్ లు చనిపోతే పోలీస్లపై కేసులు పెట్టే కమ్యూనిస్ట్లు
మావోయిస్ట్లు చనిపోతే పోలీస్లపై కఠినచర్యలనే లెఫ్టిస్టులూ
మానవహక్కులు హరిస్తున్న ప్రభుత్వాలు అని విమర్శించే
ఎర్రజెండాలు వారి అజెండా మోసే మేధావులు,మీడియాలు
పేజీలకు పేజీలు వ్యాసాలు రాసి కన్నీళ్ళు కార్చే పత్రికలు
అడవుల్లో అన్నలై గన్నులై అడ్డొచ్చిన గిరిజనులనూ,
అనుమానం వస్తె అమానుషంగా చంపే అమాయకులనూ,
విధిరక్షణలో చనిపోయిన కాదు చంపబడుతున్న పోలీస్లకై
ఒక్కనాడైనా,ఒక్కసారైనా వాళ్ళ ప్రాణాలకు విలువనిచ్చారా ?
వారికుటుంబాల గూర్చి ఆలోచించారా? కన్నీళ్ళు కార్చారా?
పరాయి కిరాయి దేశాల తోత్తుల్లారా కసాయి సుత్తి కత్తుల్లారా
మీ ఆటలు మీ మాటలు వినేవారు లేరని ఏడుస్తూ ఉనికి కోసం
ఎంత మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నా మాట్లాడని మీ సంఘాలు ప్రజల్లో సమాధి కాక తప్పదు!
ప్రభుత్వాలు ముందు ఈ దేశంలో ఉంటున్న అర్బన్ నక్సలైట్లను అరెస్ట్ చేసి బొక్కలో తోయాలి..ప్రజల మధ్యలో ఉంటూనే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న లెఫ్ట్ పార్టీల కుట్రలను చేధించాలి.
ఆపరేషన్ కగార్ టార్గెట్ రీచ్ కావాలి..ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్న వామపక్ష ఉగ్రవాదం,ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అంతం చేసే వరకు ఈ దేశానికి విముక్తి లేదు..జై హింద్
సూపర్ అన్న గారు.