భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా, వారి త్యాగాలను అపహాస్యం చేసేలా, భారత్ సైన్యం సాహసోపేతంగా చేసిన ఆపరేషన్ సింధూర్‌ను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజరీ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీమతి సూరపెల్లి సుజాత పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయలు శంకర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తారు.

ఆపరేషన్ సింధూర్ పట్ల దేశం గర్వంగా ఉన్న సమయంలో దేశంలో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా, సైన్యాన్ని కించపరిచేలా సుజాత గారు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉండి, విద్యార్థుల్లో దేశభక్తిని నింపాల్సింది పోయి.. దేశద్రోహిలా పోస్టులు పెట్టడం బాధ్యతారాహిత్యానికి సంకేతం.
అటువంటి పోస్టులు పెట్టిన సూరపెల్లి సుజాత గారిని తక్షణమే తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ అడ్వైజరీ బోర్డు నుంచి తొలగించాలి, అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం అంటూ లేఖ రాసిన పాయల్ శంకర్..
