అది నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువున్న నల్లగొండ జిల్లా..
ఎక్కడ చూసినా ఎర్ర జెండాలు..చైనా దేశ చెంచాలు..
ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో దేశ వ్యతిరేక చర్యలు…స్వాతంత్రం బూటకం అంటూ దేశంపై తిరుగుబాటు చేస్తున్న నక్సలైట్లు..
అడవుల్లో నక్సలైట్లుగా..విద్యాలయాల్లో ర్యాడికల్ స్టూడెంట్స్ గా విద్యార్థుల మదిలో దేశ వ్యతిరేక చర్యలు..
ప్రజాస్వామ్యంతో వీళ్లకు సంబంధం లేదు..
హక్కులకు వీళ్ళ రాజ్యంలో స్థానం లేదు..
ఎదురుతిరిగిన వాడి కాళ్ళు చేతులు నరికేస్తారు..
ప్రశ్నించిన వారి గొంతులు తెగుతాయి..ప్రాణాలు పోతాయి..
ABVP లో పని చేస్తూ దేశభక్తిని నరనరాన నింపుకున్న శ్రీనన్న చిన్న వయసులోనే ర్యాడికల్స్ ని ఎదిరించి,విద్యార్థుల్లో జాతీయతా భావాన్ని,దేశభక్తిని తట్టిలేపుతూ కమ్యూనిస్టుల కంచుకోటలో కాషాయజెండా రెపరెపలాడించిన వీరుడు..
మరో భగత్ సింగ్ లా నూనూగు మీసాల వయసులోనే నక్సలైట్లను ఎదురించిన యోధుడు..
ఎప్పటికైనా చంపేస్తారని,చనిపోతానని తెలిసినా పట్టిన జెండా,నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన ధీరుడు..
నల్లగొండ నాగార్జున డిగ్రీ కాలేజీ లో BSc మొదటి సంవత్సరం చదువుతున్న ఏబీవీపీ నాయకుడు ఏచూరి శ్రీనివాస్ ను నరహంతక నక్సల్స్ తాబేదారులైన రాడికల్ విద్యార్థి సంఘం గుండాలు 1981మార్చ్ 30 న ప్రాక్టీకల్స్ పూర్తి చేసుకొని వస్తుండగా కాపు కాచి కాలేజ్ గ్రౌండ్ లో కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి చంపారు…
శ్రీనన్న బతికుంటే వీళ్ళ ఆటలు సాగవని,దందాలు, దోపీడీలు ఉండవని,చైనా ఎజెండా పని ఖతం అవుతాయని గ్రహించిన..
నేరుగా పోరాడలేని నక్సలైట్లు గుంట నక్కల్లా దాక్కుని కాపుకాసి కసిగా లెక్కలేనన్ని కత్తిపోట్లతో 19 సంవత్సరాల నవయువకున్ని పొట్టన పెట్టుకున్న నక్సలైట్లు..
తుపాకీ తూటాలకు,కత్తిపోట్లతో ప్రాణాలను తీయగలిగారు కానీ వేలమందిగా పుట్టుకొచ్చిన ఏచూరి శ్రీనన్నలాంటి కార్యకర్తలు దేశం కోసం సర్వస్వం త్యాగం చేసి నక్సలైట్లను తరిమికొట్టినారంటే తెలంగాణలో అది మొట్టమొదటి బలిదానం అయిన శ్రీనన్న త్యాగమే నిదర్శనం.. మీ త్యాగం వృధా కాలేదు..
నల్లగొండ గడ్డపైన నీ నెత్తుటితో తడిచిన ఎర్రకోట కాషాయవనం అయింది.. కూకటివేళ్ళతో నక్సలిజం తుడుచుకుపోయింది..జోహార్ షహీద్ ఏచూరి శ్రీనన్న..జోహార్!🙏🚩

Atyanta baadhakaramu. COMMUNISTs lu emi chesina/,hatya chesina prasansinche NEHRU vidhanalana valana BHARATAVANI Enduro desha bhaktulsnu kolpovadamu jarigindi
Jhohar Srinanna.
Jai sriram, Bharat Mata ki Jai.
Abvp
Abvp zindabad.echuri srinanna.amar rahe. RSS,vhp,bajarangadhal, sivasena,bjp, sriramsena zindabad.