రజాకార్ సినిమా రివ్యూ..

2 గంటల్లో 200 ఏళ్ల రజాకార్ల అణిచివేత, దోపిడీ, మతమార్పిడీలు, అత్యాచారాలు, హిందూ ధర్మంపై నీచమైన దాడి, రజాకార్లు సాగించిన అరాచక పాలన,ముస్లిం మత ఛాందసవాదం,హైదరాబాద్ ని పాకిస్థాన్ వలే మరొక తుర్కిస్తాన్ దేశంగా మార్చేందుకు చేసిన ప్రయత్నాలు,ముఖ్యంగా మహిళలను నగ్నంగా బతుకమ్మలు ఆడించిన దుర్మార్గపు దారుణాలు,వెయ్యి ఊడల మర్రికి వందలాది బిడ్డలను ఉరి తీసిన చిత్రం ఇలా రజాకార్ల రాక్షసపాలనను చాలా అద్భుతంగా చూపించాడు దర్శకుడు యాట సత్యనారాయణ..

ఫస్టాఫ్ లో రజాకార్ల రాక్షస పాలన,హిందూ ధర్మంపై,హిందువులపై చేసిన అరాచకాన్ని చూపిస్తే..ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ రజాకార్లపై పోరాటాన్ని చూపించారు.తెలంగాణ ఆడబిడ్డల పోరాటాన్ని,వీరవనితలుగా వారి తెగువను,త్యాగాన్ని,ఉద్యమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.
నిజంగా మెచ్చుకోవాల్సింది రజాకార్ చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డిని.చరిత్రలో దాచిన,దాయబడిన రజాకార్ల మతోన్మాద పాలనను నేటి తరానికి కళ్ళకి కట్టినట్టు చూపించాలని చేసిన ప్రయత్నం చాలా గొప్పది.
సర్వేజనా సుఖినోభవంతు అని ప్రపంచమంతా బాగుండాలని కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మం.అలాంటి హిందూ ధర్మంపై,హిందువులపై రజాకార్లు,బ్రిటీష్ బద్మాష్ గాల్లు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు.200 ఏళ్లు అంటే 73000ల రోజులు ఒక పైశాచిక మత ఉన్మాదుల చేతిలో నరకం ఎంత అనుభవించారో సినిమా చూస్తే అర్థమవుతుంది.ఇలాంటి మత ఉన్మాదుల రాక్షసుల పాలనలో దేశం,తెలంగాణ రాష్ట్రం బంధీ అయి స్వధర్మాన్ని,ఘన చరిత్రను కోల్పోయింది.
హిందూ ధర్మం,కాషాయ జెండా కనపడద్దొని, బతకాలంటే అయితే ఇస్లాంలోకి మతం మారాలి,లేదా పారిపోవాలి,లేదా చచ్చిపోవాలి అని అమాయక ప్రజలపై రెచ్చిపోయి దాడులు,దౌర్జన్యాలు,అత్యాచారాలు,అమానుష దాడులను చేసిన రజాకార్లపై నాడు తిరగబడిన ప్రజల,నాయకుల పోరాటాన్ని అద్భుతంగా చిత్రీకరించారు
పరకాలలో జాతీయ జెండా ఎగరేసే సన్నివేశం సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు..అచ్చం ఆనాటి రోజులను గుర్తుకు తెచ్చేలా ఆ కాలం నాటి రిక్షాలు,సైకిళ్ళు,పాత గూన పెంకుటి ఇల్లు,ఆనాడు మన రైతన్నలు చేసిన వ్యవసాయం అన్నీ వెనకటి రోజులను గుర్తుకు తెచ్చేలా తీశారు.
సినిమాకి క్లైమాక్స్ అయితే రోమాలు నిక్కబొడుచుకునేలా రజాకార్లకు,భారత సైన్యానికి జరిగిన యుద్ద సన్నివేశాల్ని తెరకెక్కించారు.
మొదటి ప్రధాని నెహ్రూ చేతకాని విధానాలు,ముస్లింసంతుష్టికరణ,పాకిస్థాన్ కి భయపడి తెలంగాణ విముక్తి కోసం వెనకడుగు వేసిన నెహ్రూ నిర్ణయాలను ఈ సినిమా ద్వారా ఎండగట్టారు.నాడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక లేకుంటే,తెలంగాణ విముక్తికోసం పట్టుబడకుంటే,అంతర్జాతీయ పరిణామాలకు భయపడకుండా తెలంగాణ విముక్తి కోసం దేనికైనా సిద్ధమే అంటూ పటేల్ గారు తీసుకున్న సైనిక చర్య నిర్ణయం పటేల్ గారి తెగువను చూపించాయి.సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నిర్ణయం వల్లే నేడు తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నది..తెలంగాణ,దేశం మొత్తం రుణపడి ఉన్నది ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్ గారికి..ఆనాడు నిజానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గనుక లేకుంటే నేడు తెలంగాణ మరో పాకిస్థాన్ అయి దేశానికి పెనుముప్పుగా ఉండేది అన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది
ఆనాటి తెలంగాణ విమోచన ఉద్యమ అమరవీరులకు జిందాబాద్ అంటూ సాగే పాట కూడా చాలా అద్భుతంగా ఉంది.సినిమాకి బీమ్స్ సిసిరిలియో అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది
ఖాసిం రజ్వీగా నటించిన నటుడు సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించాడు.అందరూ అద్భుతంగా నటించారు

మొత్తంగా ప్రతీ హిందువు చూడాల్సిన సినిమా..నేటి తరానికి నాటి చరిత్రను ఈ సినిమా ద్వారా తప్పకుండా చూపించాల్సిన సినిమా..

26 thoughts on “రజాకార్ సినిమా రివ్యూ..”

    1. ఒక వర్గం చేసిన దారునలే మనకు తక్కువ చేసి చూపించారు, నిజం మనకు చూపించిన దానిలో 10% మాత్రమే

  1. Nijam jivitha lo jariginsvi kadha eppudi valla ki em teliyadu, ee movie valla kocham aiyena telisindhie anukutunanu…. Maaa history prathi okaru telusu kocali Jai sree

  2. సూపర్ గా ఉంది చాలామంది చూడాల్సి వస్తుంది ఏవేవో సినిమాలు చూస్తారు కానీ మంచి సినిమా చూసి చూడటానికి జనం రారు
    ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రజల సహకరించారు

  3. Munna real Indians

    Ila chesina wallu wandala years paripalincharu election ku mundu Ila cinema lu thisi bhale pichollanu chestunnaru mandini konni nawabalu chesina atyacharalu andaru chesesaru Ani mopadam tappu ala cheste andaru muslim untaru Hindu’s ekkadi nunchi migilaru cinema lu kalpitam matrame wallu wallaku nachinattu tistaru satyalu undawu nizam manchi tanala gurtuvi chala bhawanalu nirupistayi nizam meer osman Ali India China war kosam 5 ton gold donation ichadu mari iwanni chuyinchada

  4. Nijaalu chipite namme paristitullo leru
    Mana public ,grafics mayalo unnaru.
    Alanti cinimaalu ante istapadutaru

  5. N Lingaswamy Lecturer in Chemistry

    అప్పటి ముస్లిమ్ మత చాందస క్రూరత్వాన్ని ఇప్పటి తరానికి కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం లో సఫలీకృతం ఈ సినిమా.
    మా గ్రామము పేరు “రెడ్డిబావి”ఒక బావుద్వేగ సన్నివేశ లో వినిపించడం జరిగింది. అణిచివేత, అరాచకము పై మానవ చైతన్య విజృంభణ, indian History లో కనిపించని తెలంగాణా చారిత్రక సత్యము.
    జై హింద్

  6. బొల్లం అశ్విని కుమార్ వరంగల్

    నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి కానీ నిజాలను నిజాలని గుర్తించాలంటే మంచి మనసు ఉండాలి మొదటినుంచి ఒక జాతీయ పార్టీ ముస్లింలను అందలమెక్కించి మరో వర్గాన్ని తొక్కి పెట్టడమే వాళ్ల ప్రధాన లక్ష్యంగా కనబడింది ఎన్నో అన్యాయాల గురైన హిందువులు పరమత సహనాన్ని కలిగి ఉండడమే చాలా గొప్ప విషయం నిజాం ఏలుబడిలో హిందువులకు జరిగిన అన్యాయాలను వెలుగులోకి తేవద్దనే ఉద్దేశంతో ఎందరో కుహానా సెక్యులరిస్టులు ప్రయత్నం చేశారు కానీ వారి ఎత్తుగడలను చిత్తు చేస్తూ అదృష్టవశాత్తు చిత్రం విడుదలైంది హిందువులందరూ ఈ చిత్రాన్ని తప్పక చూడాలని నా విజ్ఞప్తి సర్వేజనా సుఖినోభవంతు

  7. ఇది చాలా అనుసం ఎందుకంటే అప్పట్లో ఇలాంటి మీడియా అనేది లేదు కేవలం పేపర్ మాత్రమే రేడియం మరియు సందేశాలు ఉండేటి ఇలాంటి అమావాస్యమైన దాడిని కండ్ల కట్టినట్టు చూపించిన డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి అనేక ధన్యవాదాలు ఇలాంటివి కచ్చితంగా

  8. బంటు అడేందర్

    చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా నాటి రజాకర్ నిరంకుశ పాలన కళ్ళకు కట్టినట్లు చూపించాడు

  9. సినిమా చాలా బాగుంది అప్పటి రజాకారులనిరంకుశపాలన కలకట్టినట్లు చూపించాడు దర్శకుడు అద్భుతమైన సినిమా ప్రతి ఒక్కరు చూడగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top