అంజన్న ఆశీర్వాద యాత్రకి రూట్ మ్యాప్ రెడీ..
ఈ నెల 14న కరీంనగర్ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు జరిగే పాదయత్రకి రూట్ మ్యాప్ ని కేంద్రమంత్రి బండి సంజయ్ గారు ప్రకటించారు.
యాత్ర వివరాలు:
- తేదీ: మార్చి 14, శనివారం.
- సమయం: ఉదయం 06:00 గంటలకు ప్రారంభం.
- ప్రారంభ స్థానం: శ్రీ మహాశక్తి దేవాలయం, కరీంనగర్.
- గమ్యస్థానం: కొండగట్టు అంజన్న దేవస్థానం.
యాత్ర సాగే మార్గం:
ఈ పాదయాత్ర కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి దేవాలయం నుండి ప్రారంభమై.. కొత్తపల్లి, గంగాధర, మరియు పూడూర్ మీదుగా సాగి చివరకు పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవస్థానానికి చేరుకుంటుంది.
అణువణువు రామనామమై…కణకణం హనుమత్ గానమై..
హైందవమే సింహనాదమై…మనమంతా బంధువులమై…
అంజన్న భక్తులమై…అడుగులో అడుగు కలిపి కొండగట్టుకు సాగుదాం..అని బండి సంజయ్ గారు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

