అంజన్న ఆశీర్వాద యాత్ర
బండి సంజయ్ గారు మరో యాత్రకి సిద్ధమయ్యాడు. ఈ నెల 14న కరీంనగర్ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నాడు.
ఇప్పుడు ఎన్నికలు లేవు కదా… ఎందుకు అని మీరు అనుకుంటున్నారు కదా. విషయం ఏంటంటే, మొన్న జరిగిన కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి మేయర్‌గా గెలిస్తే కొండగట్టుకి పాదయాత్రగా వెళ్లి అంజన్న దర్శనం చేసుకుంటా అని మొక్కుకున్నాడు. అన్నట్టుగానే బండి సంజయ్ పడిన కష్టానికి ఫలితం దక్కింది.
చరిత్ర సృష్టించి మొదటిసారిగా కరీంనగర్ కార్పోరేషన్‌పై కాషాయ జెండా ఎగురేయడం, మేయర్ పీఠం దక్కించుకోవడం, ఎన్నడూ లేనన్ని సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు గెలుచుకొని కరీంనగర్లో పట్టు నిలుపుకున్న బండి సంజయ్ మొక్కుకున్నట్టుగానే మొక్కు తీర్చడానికి గెలిచిన అభ్యర్థులతో వేలాదిమందితో పాదయాత్రగా వెళ్లి అంజన్న దర్శనం చేసుకుంటాడు.
సుమారు 50 కిలోమీటర్ల పాదయాత్రను ఒక్కరోజులో పూర్తి చేసి స్వామివారిని దర్శించుకుంటారు. పాదయాత్రలో భాగంగా మార్గమధ్యంలో ప్రజలు భారీగా నీరాజనం పట్టనున్నారు.
యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం అంటే
బండి సంజయ్ అత్యంతగా నమ్ముకునే మహాశక్తి అమ్మవారి సన్నిధి నుండి యాత్ర ప్రారంభం చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి మొక్కులు సమర్పించుకుంటారు.
యాత్రలో పాల్గొనేవారు
ఈ యాత్రలో బండి సంజయ్ వెంట
- కరీంనగర్ నుంచి ఎన్నికైన 34 మంది కార్పొరేటర్లు
- పార్లమెంట్ పరిధిలో గెలిచిన 100 మందికి పైగా సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు
- హుజురాబాద్,జమ్మికుంట,వేములవాడ,సిరిసిల్ల,చొప్పదండి తదితర మున్సిపాలిటీల్లో గెలిచిన కౌన్సిలర్లు
పాల్గొని మహా పాదయాత్రగా వెళ్లనున్నారు. దీనికి “అంజన్న ఆశీర్వాద యాత్ర” అని పేరు పెట్టారు.
బండి సంజయ్ ప్రత్యేకత
మొత్తానికి బండి సంజయ్ ఏది చేసినా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాడు. అది చార్మినార్ గడ్డపై ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించి చరిత్ర సృష్టించినా, 317 జీవోకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టి కేసీఆర్ కి ముచ్చెమటలు పట్టించినా, దుబ్బాక మరియు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయదుందుభి మోగించినా,జీహెఎంసీ ఎన్నికల్లో దుమ్ము దులిపినా, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డిని ఏకపక్షంగా గెలిపించుకున్నా, నిరుద్యోగ మార్చ్ పేరుతో యువకులతో చేసిన జంగ్ సైరన్… ఇలా ఏది చేసినా సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
తన మార్క్ తనకే సాధ్యం అన్నట్టుగా తెలంగాణలో కొత్త ట్రెండ్‌తో ఊపు ఊపాడు.
రెండవసారి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా అయిన తర్వాత కూడా ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ 20 వేల సైకిళ్లు పంపిణీ చేసి ఒక ప్రజాప్రతినిధి ఇలా కూడా చేయొచ్చు అని ఉదాహరణగా నిలిచాడు. అలాగే పేద పిల్లలకు తన సొంత పైసలతో పరీక్ష ఫీజులు కూడా తానే కట్టి మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే బండి సంజయ్ చేసిన ట్రెండ్ మార్క్ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి.
మొత్తానికి “అంజన్న ఆశీర్వాద యాత్ర” పేరుతో ఈ నెల 14న కరీంనగర్లో ఒక పండుగ వాతావరణం నెలకొనబోతోందని చెప్పొచ్చు.
దట్ ఈజ్ బండి !!
