మార్చి 8న కరీంనగర్‌లో ABVP కార్యాలయ ప్రారంభం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కరీంనగర్ విభాగ్ (ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు) కార్యాలయ ప్రారంభోత్సవం ఈ నెల మార్చి 8న ఘనంగా నిర్వహించనున్నారు.
నేటి అవసరాలకు అనుగుణంగా, కార్యకర్తల సహకారంతో పునర్నిర్మించిన ABVP కార్యాలయం కొత్త శోభను సంతరించుకుంది. కార్యాలయం పునర్నిర్మాణంతో ABVP కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
బండి సంజయ్ కుమార్ గారు (కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, పార్లమెంట్ సభ్యులు),

రఘురాజ్ కిషోర్ తివారీ గారు (ABVP జాతీయ అధ్యక్షులు),

కాచం రమేష్ గారు (RSS ప్రాంత కార్యవాహ)
మరియు ఇతర ABVP నాయకులు పాల్గొననున్నారు.
కార్యక్రమంలో భాగంగా ఉదయం 4 గంటల 5 నిమిషాలకు పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అనంతరం ఉదయం 10 గంటలకు కరీంనగర్‌లోని TRIDA త్రిద బ్యాంకెట్ హాల్‌లో పూర్వ ABVP కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది.
గతంలో ఎన్నో సంవత్సరాలు సంస్థ కోసం పని చేసిన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కరీంనగర్ ABVPతో అనుబంధం ఉన్న ప్రతి కార్యకర్త ఈ సమావేశంలో పాల్గొని గతంలో చేసిన సేవలను, మధుర స్మృతులను నెమరేసుకోవాలని మంగు నరసింహాద్రి గారు (ABVP పూర్వ రాష్ట్ర అధ్యక్షులు) మరియు అన్నల్ దాస్ మురళీ గారు (శాతవాహన విద్యా సేవా సమితి ప్రధాన కార్యదర్శి) తెలిపారు.
కరీంనగర్ అంటేనే ఉద్యమాల గడ్డగా అందరికి తెలుసు.తెలంగాణ ఉద్యమ సమయంలో ABVP పోరాటాలు,కేసులు,కార్యకర్తల అరెస్టులు నిత్యం జరిగేవి.ఎంతో మంది కార్యకర్తలు పూర్తి సమయ కార్యకర్తలుగా వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి సంవత్సరాలుగా పనిచేసిన వారు ఎందరో ఉన్నారు.వారు కూడా ఈ కార్యాలయం కేంద్రంగా అనేక ఉద్యమాలకీ రూపకల్పన చేసి ఉద్యమబావుటా ఎగురవేశారు.గతంలో పనిచేసిన ఎంతోమంది కార్యకర్తలకు స్ఫూర్తినింపిన కార్యాలయం ఇప్పుడు నేటి తరానికి,జెన్-జీ యువతను ఆకర్షించేలా వారిని కార్యకర్తలుగా మలిచేలా ఈ కార్యాలయం కేంద్రంగా నిలవాలని దీనిని పునర్నిర్మించారు.
అనేక మంది కార్యకర్తలు ఎన్నో రంగాలలో స్థిరపడి ఎంతో ఉన్నత ఎత్తుకు ఎదిగిన వారు కూడా కార్యాలయ పునః ప్రారంభోత్సవం లో పాల్గొంటున్నారు.మళ్ళీ ప్రారంభించుకుంటున్న ఈ కార్యాలయానికి జ్ఞాన భారతి నిలయంగా నామకరణం చేసారు.
