ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్..
జీవితంలో ఇంటర్ పరీక్షలు మొదటివి,చివరివి కావు..
బాగా చదివిన వాళ్ళు వందకి వంద శాతం అందరూ బాగు పడ్డట్టు కానీ..
ఏమీ చదవని వాడు వంద శాతం చెడిపోయినట్టు ఎప్పుడైనా చూసారా ?
మనం రోజూ ఆరాధించే హీరోలు ఏం చదివారు?
మనం రోజూ మేం అతని ఫ్యాన్ ఇతని ఫ్యాన్ అని చెప్పుకొనే క్రికెటర్లు ఏం చదివారు?
మనం రోజూ ఆ లీడర్ ఈ లీడర్ గురించి మాట్లాడతాం వాళ్ళు ఏమి చదివారు ?
మనం రోజూ వినే పాటలు కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్లు ఏం చదివారు?
మనం రోజూ చూసే చేసే హోటల్/షాపింగ్ మాల్/బిజినెస్ మాన్ లు ఏం చదివారు ?
మనం రోజూ చూసే యూట్యూబర్లు,ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చదివారు?
మనం రోజూ తినే అన్నం పండించే రైతులు ఏం చదివారు?
మనం సమాజంలో చూసే చాలా మంది బాగా చదివిన వాళ్లే సక్సెస్ కాలేదు..
వాళ్ళ ఇంటర్ లో ఫెయిల్ అయినా పెద్దగా చదవకపోయినా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మందే ఉంటారు.
నిజాలు మాత్రమే మాట్లాడుకుంటే బాగా చదివి జాబ్ చేస్తున్నవాళ్ళకంటే
బ్యాక్ బెంచ్ డుమ్మాలు కొట్టి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది బాగా సెటిల్ అయ్యారు,అవుతున్నారు.
అసలు మనం చదివే..రాసే పరీక్షలు జీవితంలో ప్రాక్టికల్ గా ఏం ఉపయోగపడుతున్నాయి..!
మ్యాథ్స్ లో ప్రాబబులిటీలు,ఆర్గానిక్ కెమిస్ట్రీలు,ఫిజిక్స్ లాజిక్స్ ఏవి ప్రాక్టికల్ లైఫ్ లో ఉపయోగపడవు..
మొత్తంగా ఇంటర్ మన జీవితంలో ఒక భాగం..పరీక్షలు ఇలా వస్తాయి ఆలా పోతాయి..
కానీ బాగా రాయక ఫెయిల్ అయితే సూసైడ్ లు,
చాలా బాగా రాసి 1000 కి 990 వచ్చినా 10 మార్కులు పోయాయని సూసైడ్ లు చేసుకొనే వాళ్లున్నారు..
కాబట్టి ఇది వాళ్ళ కోసమే..
జీవితం చాలా ఉంది చూసేది..చేసేది..
జీవితంలో పరీక్షలు కామన్..
పాస్ ఫెయిల్ కామన్..
ఫెయిల్ అయితే సినిమాలో వచ్చే ఇంటర్వెల్ లాంటిది..
ఇంటర్వెల్ తోనే సినిమా అయిపోదు..తర్వాత కూడా సినిమా ఉంటది..
కావున గుర్తున్నకాడికి,వచ్చిన కాడికి రాసి వచ్చేయండి..
రిజల్ట్స్ కూడా అంతే..
Take it everything easy !!
