కేంద్రమంత్రి బండి సంజయ్ రూటే సపరేట్ అన్నట్టు ఉంటుంది.బండి ఏది చేసినా సంచలనమే..ఏది మాట్లాడినా బ్రేకింగ్ న్యూసే.ఇప్పుడు కూడా బండి సంజయ్ చేపట్టిన కార్యక్రమం చూస్తే ప్రత్యర్థులు షాక్ కావాల్సిందే.

మొన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా గెలిచిన కార్పొరేటర్లు,కౌన్సిలర్లను ఈరోజు(24.02.2026) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు గారితో కలిపించి అనంతరం ఉదయం 11 గంటలకు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శిస్తారు.
ఓల్డ్ సిటీ సెంటర్ గా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని స్టార్ట్ చేసిన ప్రజా సంగ్రామ యాత్ర ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిన విషయ
ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎం అడ్డాగా అనుకుని ఏ పార్టీ కూడా సాహసం చేయని చోట,అధికారంలో ఎవరున్నా ఒవైసీ కి భయపడి ఓల్డ్ సిటీలో ఎన్నికల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టరు.అలాంటి చోట వేలమందితో కాషాయజెండా రెపరెపలాడించి జై శ్రీరామ్ అంటూ గర్జన వినిపించాడు బండి సంజయ్.
ఇప్పుడు మళ్ళీ రానున్న GHMC ఎన్నికలకు అందరికంటే ముందే ఎన్నికల శంఖారావం పూరించడానికి కరీంనగర్ లో గెలిచిన కార్పొరేటర్ల,కౌన్సిలర్లను భాగ్యలక్ష్మీ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లడం,కాషాయ వాతావరణం క్రియేట్ చేయడం పక్కా..బండి సంజయ్ మార్క్ అంటే ఇలానే ఉంటుంది.
మొన్ననే చూసాం కరీంనగర్ లో మేయర్ సీటు దక్కించుకొని కొత్త చరిత్ర సృష్టించిన బండి బీజేపీ కార్యకర్తలకు రాష్ట్రవ్యాప్తంగా కొత్త బూస్టప్ ఇచ్చాడు.కరీంనగర్ కార్పొరేషన్ గెలవడానికి బండి సంజయ్ కాలికి బలపం కట్టుకొని తిరిగినట్టు ప్రతీ గల్లీ గల్లీ తిరిగి ప్రజలను ఒప్పించి తనకోసం కష్టపడ్డ కార్యకర్తలను గెలిపించుకొని తానేంటో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.కరీంనగర్ అడ్డా..బీజేపీ అడ్డాగా మార్చాడు.
ఇప్పుడు GHMC లో కాషాయ జెండా పాతడమే ధ్యేయంగా యుద్ధం ప్రారంభించాడు.కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు సమయం ఇచ్చారు కానీ ఇక సమరమే అని మొన్ననే ప్రకటించి కాంగ్రెస్ పై పోరాటం ప్రారంభించాడు.దటీజ్ బండి!

