Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్

Praveen Reddy Naredla, 22/02/202622/02/2026
Spread the love
     

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగిన సంఘటనలు బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరాటానికి దారి తీశాయి.కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణా రెడ్డి,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ ఆరోపణలు కౌంటర్ వెంకట రమణా రెడ్డి సవాళ్ల మధ్య కామారెడ్డి యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి ఎమ్లెల్యే క్యాంపు ఆఫీస్ పై దాడికి పోవడం,బీజేపీ కార్యకర్తలు అడ్డుకొని ప్రతి దాడి చేయడం ఘర్షణకు దారి తీసింది..ఈ క్రమంలోనే ఎమ్మెల్యేని హౌజ్ అరెస్ట్ చేయడం,బీజేపీ నాయకులను అరెస్ట్ లు చేయడం పెద్ద వివాదంగా మారాయి.

అదే విధంగా బాన్సువాడలో ఒక మార్ట్ లో జరిగిన సంఘటన,హిందువులపై దాడి,పోలీసుల అరెస్టులు వరుసగా హిందువులపై. దాడులు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడి చర్యలు తీసుకోకపోకడం,నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం బీజేపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరా గాంధీ హయాంలో విపక్ష నేతలను ఇష్టానుసారం అరెస్టు చేసి గొంతు నొక్కిన 1975 ఎమర్జెన్సీ చీకటి రోజులను మళ్లీ గుర్తుకు తెస్తోంది.

నేడు మన రాష్ట్రంలో సరిగ్గా అలాంటి పరిస్థితులే పునరావృతమవుతున్నాయి. బుజ్జగింపు రాజకీయాలకే పూర్తిగా దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీ.. బాన్సువాడ, కామారెడ్డి ఘటనల అనంతరం, తమను ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టుల పరంపరను కొనసాగిస్తోంది.

బాన్సువాడలో హిందువుల ఇళ్లపై జరిగిన రాళ్లదాడి అత్యంత అమానుషమైన చర్య, దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలను స్వయంగా కలిసి, వారికి మనోధైర్యాన్ని కల్పించి, వారికి మేమంతా అండగా ఉన్నామని భరోసా ఇవ్వాలన్నదే నా ఏకైక ఉద్దేశం.

అలాగే, కామారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల దాడికి గురైన మన పార్టీ కార్యకర్తలను పరామర్శించాలని భావించాను. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కులను వినియోగించుకుంటున్న పార్టీ కార్యకర్తలను, ఇలాంటి రాజకీయ హింసకు బలిపశువులను చేయలేము.

నన్ను ఆ పర్యటనలకు వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక రాజకీయ నాయకుడిని నిలువరించినట్లు కాదు.. రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య స్ఫూర్తిపైనే నేరుగా దాడి చేసింది.

ఒకవైపు చేతిలో రాజ్యాంగం పట్టుకుని గొప్పగా నీతులు వల్లిస్తారు.. మరోవైపు అదే రాజ్యాంగ సూత్రాలను ఏమాత్రం సంకోచం లేకుండా కాలరాస్తారు.

కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి.. వారి మాటల్లోని డొల్లతనం, నిరంకుశ పోకడలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమాదకరమైన దిశగా నడిపిస్తున్నాయి.

హిందూ సమాజాన్ని సంఘటితం కానివ్వకుండా కాంగ్రెస్ కపట రాజకీయం..

కాంగ్రెస్ నాయకులు…
హిందువులను కాపాడరు, హిందువులకు అండగా నిలువరు
హిందూ సమాజానికి అండగా నిలిచే వారిని అడ్డుకుంటారు…

బిజెపి – హిందూ సంఘాల నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేసినందుకు, స్వయంగా వెళ్ళి.. వారికి మద్దతు ఇవ్వడానికి బాన్సువాడకు బయలుదేరిన వారిని అడ్డుకోవడం కాంగ్రెస్ పిరికితనం, హిందూ సమాజాన్ని అణచివేయాలనే ఉద్దేశం స్పష్టం అవుతుంది..

బిజెపి నాయకులపై కాంగ్రెస్ గూండాల దాడికి దిగితే కనీసం పరామర్శించే వీలు లేకుండా, ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి… ఎక్కడ బిజెపి నాయకుల నేతృత్వంలో ప్రజలు ఏకమై తమ ప్రభుత్వం యొక్క పునాదులు కుదిపేస్తారన్న భయంతో పకడ్బందీగా బిజెపి నాయకులను అడ్డుకొని కాషాయ సైన్యాన్ని ఆపుతాం అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వమే అవుతుందని రాంచందర్ రావు ప్రభుత్వంపై విరుచుకపడ్డారు .


Spread the love
     
 
      
News National Telangana ArrestbansuvadaBjpCongresshindukamareddykatepally Venkata Ramana ReddymlaRamchander raoshabbirali

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • కామారెడ్డి గొడవ ఏంటో చెప్పేసిన ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్
  • గర్భిణీ స్త్రీలకు కేంద్ర ప్రభుత్వ సహాయం 11000/- రూపాయలు
  • రైతుభరోసా ఎప్పుడో తెలిసిపోయింది..
  • రేవంత్ రెడ్డి మిలాఖత్-ABVP రాంబాబు

Recent Comments

  1. winni jogo de aposta on అత్యంత నిజాయితీపరుడు రైతన్న!!
  2. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

Archives

  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Blog
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | WordPress Theme by SuperbThemes