ప్రియమైన స్నేహితులారా మరియు బంధువులారా నమస్కారం.
” లంకనం పరమ ఔషధం” అంటే ఉపవాసం ఒక పరమమైన ఔషధమనే సామెత మన తెలుగు సామెతలు ఒక ప్రముఖ సామెత. దీనివల్ల అనేక రకాల వ్యాధులు నివారించబడతాయి.
ఇక నా అనుభవాలు చదవండి.
నేను సెప్టెంబర్ లో ఇంటర్మీటంట్ ఫాస్టింగ్ ఆరంభించిన విషయం మీకు అందరికీ తెలుసు. ప్రస్తుతం ఐదు నెలలు కన్నా ఎక్కువ సమయం గడిచిపోయింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరంభించి సోమవారం మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఉపవాసం ఉంటాను.
ఈ ఉపవాసం చేయటానికి మొదట్లో నెలన్నర వరకు అలవాటు కావడానికి సమయం తీసుకుంది. ఈ సందర్భంగా ఈ సమయంలో నేను సాధించిన ప్రగతిని మీతో పంచుకోవడానికి ఈ చిన్న ఆర్టికల్ రాస్తున్నాను.
కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశంలో ఉపవాసం ఏదో ఒక రూపంలో అంటే వారపు ఉపవాసాలు ఏకాదశి ఉపవాసాలు మాస శివరాత్రి ఉపవాసాలు పండుగలు ఉపవాసాలు వంటి ఎన్నో ఉపవాసాలు మనం ఆచరిస్తూ ఉంటాం. జైన మతంలో సూర్యాస్తమయం కంటే ముందే భోజనం చేయడం వల్ల వాళ్లు ప్రతి రోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగే చేస్తారు.
ఉపవాసంతో పాటు నేను వక్రాసనం అనే ఆసనం 18 నిమిషాల పాటు వేస్తున్నాము. అంతేకాక ప్రతిరోజు నీళ్లలో నానబెట్టుకుని సబ్జా గింజల్ని తింటూ ఉంటాను. సుమారుగా 40 నిమిషాల పాటు చేస్తూ ఉంటాను. అంతేకాక 18 గుంజీలు తీస్తుంటా.
వక్రాసనం మన శరీరంలో స్వతసిద్ధంగా ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయడంలో సహాయం చేస్తుంది. అంతేకాక పొట్ట మరియు నడుము తగ్గడంలో సహాయపడుతుంది. శరీరం మొత్తాన్ని సాగదీస్తుంది. అంతేకాక తాడాశనంలో ఐదు నిమిషాల పాటు కనీసం నడుస్తూ ఉంటా.
సబ్జా గింజలు తినటం వల్ల లిపిడ్ ప్రొఫైల్ మెరుగుపడుతుంది. తగ్గుతాయి హైడెన్సిటీ లిపిడ్స్ పెరిగినాయి.
గుంజిల్లు తీయడం వల్ల శ్వాస 2 నాసికల నుండి సమానంగా వెళ్లడంతో కొంతకాలం తర్వాత ప్రాణశక్తి ప్రవాహము sushumna నాడి నుంచి నుంచి జరగడానికి అవకాశం ఉంటుంది.
గతంలోనే చెప్పినట్టు సుమారు 14 గంటల కంటే ఎక్కువ సమయం ఉపవాసం ఉండటం వల్ల శరీరం అందు ఆటో ఫాగి ఆరంభమవుతుంది. ఆటో ఫాగి ప్రక్రియలో రోగగ్రస్త కణాలు నశించడమే కాకుండా రిపేర్ కూడా అవుతాయి. దానివలన మన శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మనం ఎక్కువ కాలం కూడా బతుకుతాం.
గతంలోనే చెప్పినట్టు ఉపవాసం అంటే మనం కేవలం నీరు మాత్రమే తాగటం. మరి ఇతర ఘన ద్రవ పదార్థాల సేవనం నిషిద్ధం.
సూర్యాస్తమయం కంటే ముందే భోజనం చేయడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. భోజనం అరగడానికి శరీరానికి ఎక్కువ సమయం లభిస్తుంది. వీలైనంత వరకు రాత్రి తీసుకునే ఆహారం లేదా సాయంత్రం తీసుకునే ఆహారం చాలా సాత్వికమైనది ఉంటే చాలా మంచిది. మన శరీరంలో రాత్రి 11 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు డీటాక్స్ఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది.
ఆ సమయం అంటే 11 గంటలకు నాలుగు గంటల ముందు అంటే ఏడు గంటల్లోపు తినటం వల్ల శరీరము డిటాక్సిఫికేషన్కి పూర్తిస్థాయిలో సిద్ధమవుతుంది. 6 గంటల కంటే ముందు భోజనం చేస్తే ఇంకా మంచిది.
సంక్లిష్టమైన కణాలన్నీ సరళమైన కణాలుగా ఈ డిటాక్సిఫికేషన్ ప్రక్రియలో జరుగుతాయి.
ఆ తర్వాత ఉదయమే యోగా చేయటం మరియు ఉపవాసాన్ని కొనసాగించడం వల్ల రోగగ్రస్త కణాల యొక్క నాశనం మరియు రిపేర్ అత్యంత ప్రభావవంతంగా జరుగుతాయి. దీనివల్ల మన శరీరంలో క్యాన్సర్ కణాల సంఖ్య తగ్గి మనం క్యాన్సర్ని నివారించవచ్చు.
ఇప్పుడు ఈ కాలంలో నాలో వచ్చిన మార్పుల్ని మీకు తెలియజేస్తాను.
- బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మెడిసిన్స్ కొంతవరకు తగ్గించిన తగ్గుదలని సూచించాయి. అంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని అర్థం. అంతేకాక నేను ఇతరు రోజుల్లో కూడా 6:30 లోపు రాత్రి భోజనాన్ని పూర్తి చేస్తున్నాను. గతంలో కేవలం మూడు రొట్టెలు తినేవాడ్ని ప్రస్తుతం మూడు లేదా నాలుగు రొట్టెలు తింటున్నాను.
- జీర్ణ వ్యవస్థ చాలా మెరుగుపడింది అంతకుముందు గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉండేది. ఈ మధ్యకాలంలో గ్యాస్టిక్ సమస్య 90% తగ్గింది. ఇది నాకు మా తల్లి వైపు నుంచి వచ్చిన అనువంశికమైన సమస్య. అంటే మనం ఉపవాసం ద్వారా అనువంశిక సమస్యల్ని కూడా అధిగమించవచ్చు.
- లిపిడ్ ప్రొఫైల్ కూడా చాలా వరకు మెరుగుపడింది. పూర్తిగా నార్మల్ కి వచ్చాయి.
- ఫైబర్ ఫుడ్ అధికంగా తినటం వల్ల గతంలోనే విసర్జక వ్యవస్థ చాలా బాగుండేది. ప్రస్తుతం మరింత మెరుగుపడింది. ఒక్కోసారి మలవిసర్జన మూడుసార్లు కంటే ఎక్కువగా జరుగుతుంది అంటే మీ శరీరంలో ఉన్నటువంటి మలినాలు యొక్క విసర్జన ఎక్కువగా జరుగుతుందని అర్థం.
- శ్వాస వ్యవస్థ కూడా చాలావరకు మెరుగుపడింది. సోమవారం ఉదయం శరీరం నుండి తెమడ మాత్రం చాలా వస్తుంది.
- ఆనందదాయకమైన విషయమేమంటే నేను ఎటువంటి శ్రమ చేయకుండా ఈ కాలంలో ఓ రెండు కిలోలు బరువు తగ్గడం జరిగింది.
- అత్యంత ఆనందదాయకమైన విషయం మరొకటి ఏమంటే కొత్త ఆరోగ్య సమస్యలు రాకపోవడం.
మీరందరూ కూడా ఉపవాసాన్ని మరియు యోగ నీ ఆచరించి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఆకాంక్షిస్తూ…
మీ ప్రియ
బోనగిరి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్.
