తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అవసరాల దృష్ట్యా ఐఏఎస్ అధికారుల విస్తృత స్థాయి బదిలీలు చేపట్టింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (ప్రత్యేక విభాగం) శాఖ జీఓ ఆర్.టి. నం.290 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీలు మరియు నియామకాల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:
- సంజయ్ కుమార్‌ను పరిశ్రమలు, ఐటీ & వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుండి పీఆర్ & ఆర్‌డీ, ఆర్‌డబ్ల్యూఎస్ & ఆర్‌ఎస్‌ఏడీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.
- సబ్యసాచి ఘోష్ పదవిని ఫ్లాగ్‌షిప్ సంక్షేమ & అభివృద్ధి పథకాల అమలు విభాగంతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) బాధ్యతలతో పునర్నియమించారు.
- ఎం. దాన కిషోర్‌ను విపత్తు నిర్వహణ విభాగ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
- ఎన్. శ్రీధర్‌ను ఐటీ & పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గనులు & భూగర్భశాఖ అదనపు బాధ్యతలు కొనసాగిస్తారు.
- రాహుల్ బోజ్జాను సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసి, బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.
- ఈ. శ్రీధర్‌ను నీటిపారుదల శాఖ కార్యదర్శిగా నియమించారు.
- డా. గౌరవ్ ఉప్పల్‌ను ఆర్థిక & ప్రణాళిక శాఖ కార్యదర్శిగా బదిలీ చేసి, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ & మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అదనపు బాధ్యతలు అప్పగించారు.
- బి. విజయేంద్రను మహబూబ్‌నగర్ కలెక్టర్ పదవి నుండి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి & షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా నియమించారు.
- డి. దివ్యకు ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి అదనపు బాధ్యతలు అప్పగించారు.
- అద్వైత్ కుమార్ సింగ్‌ను తెలంగాణ భవన్, న్యూఢిల్లీ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.
- ఎం. హనుమంతరావును ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా బదిలీ చేసి, గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి బాధ్యతలు అప్పగించారు.
- సిక్తా పట్నాయక్‌ను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.
- సందీప్ కుమార్ ఝాను జనగాం కలెక్టర్‌గా నియమించారు.
- ఎం.డి. ముషర్రఫ్ అలీ ఫారూఖీని కొత్త డిస్కమ్ చైర్మన్ & ఎండీగా నియమించారు.
- కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెలా సత్పథిని కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ చేశారు.
- అనురాగ్ జయంతిని యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియమించారు.
- రాహుల్ రాజ్ పి.ఎస్‌ను సహకార శాఖ ప్రత్యేక కమిషనర్ & సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా నియమించారు.
- భావేష్ మిశ్రాను ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పునర్నియమించారు.
- జితేష్ వి. పాటిల్‌ను టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ & ఎండీగా నియమించారు.
- రిజ్వాన్ బాషా షేక్‌ను జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు.
- సంతోష్ బి.ఎం.ను గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా నియమించారు.
- ప్రతీక్ జైన్‌ను నారాయణపేట కలెక్టర్‌గా బదిలీ చేశారు.
- హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్‌ను మహబూబాబాద్ కలెక్టర్‌గా నియమించారు.
- పి. కాత్యాయనీ దేవిని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
- జి. ఫణీంద్ర రెడ్డిని నారాయణపేట అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా బదిలీ చేశారు.
- చిత్ర మిశ్రాను కరీంనగర్ కలెక్టర్‌గా నియమించారు.
- గరిమా అగ్రవాల్‌ను రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియమించారు.
- దీపక్ తివారిని వికార్‌బాద్ కలెక్టర్‌గా నియమించారు.
- ప్రతిమ సింగ్‌ను మెదక్ కలెక్టర్‌గా నియమించారు.
- అంకిత్‌ను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియమించారు. నేటిధాత్రి, వరంగల్
- చాహత్ బాజ్‌పాయ్‌ను హనుమకొండ కలెక్టర్‌గా నియమించి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదనపు బాధ్యతలు అప్పగించారు.
- ఖుష్బూ గుప్తాను మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియమించారు.
- మంద మకరందును జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
- ఫైజాన్ అహ్మద్‌ను మెడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌గా నియమించారు.
- శివేంద్ర ప్రతాప్‌ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
- పర్మార్ పింకేశ్‌కుమార్ లలిత్‌కుమార్‌ను జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా నియమించారు.
- ఉమాశంకర్ ప్రసాద్‌ను వికార్‌బాద్ అదనపు కలెక్టర్‌గా నియమించారు.
- జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్‌ను నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్‌గా నియమించారు.
- పి. చంద్రయ్యను మంచిర్యాల అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు.
- వై.వి. గణేష్‌ను వరంగల్ అదనపు కలెక్టర్‌గా నియమించారు.
- అబ్దుల్ హమీద్‌ను సిద్ధిపేట అదనపు కలెక్టర్‌గా నియమించారు.
- బి. వెంకటేశ్వర్లును నిర్మల్ అదనపు కలెక్టర్‌గా నియమించారు.
- ఎన్. ఖీమ్యా నాయక్‌ను వనపర్తి అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు.
- కె. విద్యాసాగర్‌ను ఇండస్ట్రీ & ఇన్వెస్ట్‌మెంట్ సెల్ & స్పీడ్ అదనపు సీఈఓగా నియమించారు.
- ఎం. సురేందర్‌ను ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా నియమించారు.
