Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్ పర్యటన: మోడీ దౌత్య ధైర్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది

Praveen Reddy Naredla, 26/02/202626/02/2026
Spread the love
     

నరేంద్ర మోడీ మొగాడు..మొనగాడు!!

నిజంగా మోడీ గట్స్ చూపించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసాడు.యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్ పర్యటన: మోడీ దౌత్య ధైర్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది

ఒకవైపు గాజా-హమాస్ & ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఏ దేశ నాయకుడు అయినా ఇజ్రాయెల్ దేశానికి పర్యటనకి వెళ్తాడా ? అందుకే మోడీ నిజంగా మొగాడు..మొనగాడు!

మరి అదే మొనగాడికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎయిర్ పోర్ట్ లో రెడ్ కార్పెట్ పై ఘాన స్వాగతం పలికాడు.నెతన్యాహు భార్య సారా నెతన్యాహు కూడా ఘన స్వాగతం పలకడమే కాదు కాషాయ వస్త్రాలను ధరించి సర్ప్రైజ్ చేసింది.నెతన్యాహు,మోడీలు నీ జేబులో కాషాయం,నా భార్య కూడా కాషాయం ధరించింది అనగానే నవ్వులు కురిపించాడు మోడీ గారు.

మోడీ గారి ఆలింగనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని ఈ సందర్బంగా నెతన్యాహు అనడం వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ను తెలియజేస్తుంది.

ఇజ్రాయెల్ దేశ మీడియా కూడా మోడీ గారిని ఆకాశానికి ఎత్తేసాయి.అమిత ప్రాధాన్యం ఇచ్చి జెరూసలేం పోస్ట్ పేపర్ మోడీ ఫోటోతో నమస్తే అని హిందీలో మోడీ అని ఇజ్రాయెల్ భాషలో హెడ్డింగ్ పెట్టి మోడీ గారి పట్ల ప్రేమ,గౌరవాన్ని చూపించింది.

ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య దౌత్య సమావేశాలు జరిగాయి.ఆర్థిక,రక్షణ,టెక్నాలజీ,వ్యవసాయ మొదలగు రంగాలపై చర్చలు జరిపారు.

మోడీ గారికి అరుదైన గౌరవం

ఇజ్రాయెల్ పార్లమెంట్ కెన్సెట్ లో ప్రసంగించిన  మొట్ట మొదటి విదేశ నాయకుడుగా చరిత్ర సృష్టించాడు.అంతేకాకుండా అత్యున్నత “స్పీకర్ ఆఫ్ ద కెన్సెట్ మెడల్” ను బహూకరించి ఘనంగా సన్మానించింది.

స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన ఇజ్రాయెల్ పార్లమెంట్ 

మోడీ గారి స్పీచ్ కి ఫిదా అయ్యారు ఇజ్రాయెల్ పార్లమెంట్ సభ్యులు..

భారత ఇజ్రాయెల్ బంధం రక్తం,త్యాగాలతో ముడిపడి ఉందని ఇక్కడ కెన్సెట్ లో నిలబడటం నాకు,భారతదేశానికి దక్కిన గౌరవం అని అన్నారు.ఒక గొప్ప నాగరికతకు చెందిన ప్రతినిధి..మరొక గొప్ప నాగరికతను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని మోడీ కరతాళ ధ్వనుల మధ్య అన్నారు.

ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడిని మోడీ గారు ఖండించారు.ఇప్పుడే కాదు భారత్ ఎప్పటికీ ఇజ్రాయెల్ కి అండగా ఉంటుందని అన్నారు.సామాన్య ప్రజలను చంపటాన్ని ఏ విధంగానూ సమర్తించుకోలేరు.ముంబైలో 26/11 లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో భారతీయులతో పాటు ఇజ్రాయెల్ పౌరులు కూడా చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేసారు.మేము,మీరు ఉగ్ర భాదితులేనని,ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని అన్నారు.

రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నారు.ఇజ్రాయెల్ ను స్టార్టప్ దేశం అని సంభోదించిన మోడీ మా దేశం కూడా యువత ఆవిష్కారణలతో దూసుకుపోతోందని అన్నారు.

మోదీ ప్రపంచ గొప్ప నేతల్లో ఒకరు:నెతన్యాహు 

అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మోడీని పొగడ్తలతో ముంచెత్తాడు.మోడీ తనకు స్నేహితుడికంటే ఎక్కువ అని,సోదర సమానుడని అన్నారు.ఇజ్రాయెల్ భారత్ సంబంధాలను బలోపేతం చేయటంలో మోడీయే ఛాంపియన్ అని అన్నారు.మోడీ ఆలింగనం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినదని అన్నారు.140 కోట్ల జనాభాతో భారత్ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా అభివృద్ధి చెందిందని అన్నారు.ఇజ్రాయిల్ కూడా శక్తివంతమైనదేనని,ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలని,మన రెండు దేశాలు కలిసి ఉక్కు బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ తదితరులు పాల్గొన్నారు


Spread the love
     
 
      
News

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • భారత్ బాదుడు..జింబాంబ్వే బెంబేలు!!
  • ఐఏఎస్ అధికారుల బదిలీలు..మన కలెక్టర్ ఎవరంటే !!
  • యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్ పర్యటన: మోడీ దౌత్య ధైర్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది
  • ఇంటర్ విద్యార్థులారా మీరు ఆరాధించే వారు ఏం చదివారు ?
  • పాతబస్తీకి బండి సంజయ్ !!

Recent Comments

  1. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  2. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..
  5. Meesala Venkatesh on నక్సలిజం – ఒక విఫల ప్రయత్నం

Archives

  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | Terms & Conditions | Privacy Policy | Disclaimer