ప్రకాష్ రాజ్ కి అన్నామలై ఇచ్చిన కౌంటర్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుద్ది..
విషయం ఏంటంటే నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఇంస్టాగ్రామ్ లో 100 మిలియన్ల (10కోట్ల) ఫాలోవర్లను చేరుకొని రికార్డ్ సృష్టించారు.సోషల్ మీడియాలో మోడీ గారికి ప్రపంచ నేతలనుంచి,మన దేశ ప్రజల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిలో భాగంగానే తమిళనాడు బీజేపీ నాయకుడు,మాజీ ఐపిఎస్ అన్నామలై మోడీ గారిని అభినందిస్తూ ట్విట్టర్(X) లో పోస్ట్ చేసారు ఇలా..
“ఇతరులు ఆల్గోరిథమ్‌ను క్రాక్ చేయడానికి నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు.
కానీ మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు ఆల్గోరిథమ్‌ను క్రాక్ చేయరు… ఆయనే ఆల్గోరిథమ్..
ఆయనే నిర్వచిస్తారు. ప్రపంచం ఆయనను అనుసరిస్తుంది.
మన గౌరవ ప్రధాన మంత్రికి ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ ఫాలోవర్స్!
అని అభినందిస్తూ ట్వీట్ చేయగా ప్రకాష్ రాజ్ కౌంటర్ ట్వీట్ చేస్తూ అయితే ఏమైనా ఉపయోగం ఉందా? దేశం తెలుసుకోవాలనుకుంటుంది,జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో ట్వీట్ కొట్టారు.
దీనికి అన్నామలై ఊరుకుంటాడా మళ్ళీ ప్రకాష్ రాజ్ కి గట్టి చురకలు అంటిస్తూ మాస్ కౌంటర్ ట్వీట్ ఇచ్చి పడేసారు.ఈ కౌంటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అన్నామలై ఏమని కౌంటర్ వేసాడంటే..
• అన్నా..ఎవరు అడగకపోయినా ఇచ్చే నా సలహా.
కడుపులో మంట (acidity)కి Gelusil వేసుకో,కాలిన గాయానికి Burnol వేసుకో ఇప్పుడే నీకు అవసరం అవుతుంది అని #justsaying అని కౌంటర్ ట్వీట్ వేశారు.
దెబ్బకి ఫుల్ వైరల్ అయి కూర్చుంది ఈ ట్వీట్!!
ఇదీ మోడీ vs ప్రకాష్ రాజ్ vs అన్నామలై కథ!!

ఇక్కడ గతంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ని కామెంట్స్ లో పెట్టి ప్రకాష్ రాజ్ ని చెడుగుడు ఆడుకుంటున్నారు నెటిజన్లు .
