సంచలనం రేపుతున్న చెంగిచర్ల సంఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతోంది.
హోళీ ఆడుతున్న గిరిజన యువతులపై దాడులు చేసిన రౌడీ మూకలపై 4 రోజులైనా చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశం అయింది..
బాధితులపై కేసులు పెట్టిన పోలీసులు..దాడులు చేసిన మరక రౌడీ మూకలను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు.
ఈరోజు చెంగిచర్ల సంఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని పోలీసులు అడ్డుకొని వెళ్లకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. (Raja Singh under house arrest)
గత నాలుగు రోజులుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అందరూ వెళ్లి భాదితులను పరామర్శించారు.
పోలీసులు అడుగడుగునా బండి సంజయ్ ని అడ్డుకున్నారు. చివరికి బండి సంజయ్, కార్యకర్తలు పోలీసులను తోసుకొని పోయి బాధితులను పరామర్శించారు.
ఈ సంఘటనలో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం సైలెంట్ గా ఉండడం,కేసులు పెట్టకపోవడం,అరెస్ట్ చేయకపోవడం వల్ల ఒక వర్గం ఓట్ల కోసం ఎంతగా పాకులాడుతున్నరో అర్థమవుతుందని హిందూ సంఘాల నేతలు అంటున్నారు..వెంటనే దాడిచేసిన మూకలపై చర్యలు తీసుకోవాలని భాదితులు డిమాండ్ చేస్తున్నారు.