వయనాడ్ లో రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పట్టిస్తున్నది స్మృతీ ఇరానీ..!
2019లో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేశాడు.ఒకటి కేరళ రాష్ట్రం వయనాడ్ లోక్ సభ స్థానం.ఇంకొకటి తనకు కంచుకోట లాంటి అమేథీ.అమేథీ సీటు నుంచి రాహుల్ పోటీ చేస్తే కంచుకోటను బద్దలుకొట్టి స్మృతీ ఇరానీ చిత్తుగా ఓడించింది..

ముస్లింలు,క్రిస్టియన్ లు మెజారిటీగా ఉండే వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ ఈసారి ఒక్క వయనాడ్ నుంచే పోటీ చేస్తున్నాడు.
నిన్న వయనాడ్ నుంచి బీజేపీ అభ్యర్థి,కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ నామినేషన్ ర్యాలీకి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యి రాహుల్ గాంధీ పారిపోయి ఇక్కడకు వచ్చాడని చురకలు వేసింది.
ముస్లింలు 45 శాతం ఉండే వయనాడ్ లో భారీగా బీజేపీ కార్యకర్తలు నామినేషన్ ర్యాలీలో పాల్గొని ఈసారి రాహుల్ గాంధీకి గెలుపు అంత సులువు కాదని ఛాలెంజ్ విసిరారు.

స్మృతీ ఇరానీ ఎంట్రీతో వయనాడ్ కాషాయమయం అయింది.స్మృతీ ఇరానీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఒక్క అభివృద్ది పని చేయలేదని,మహిళలకు సంబంధిచిన వందల కోట్ల అభివృద్ది పనులను కూడా చేయలేదని,ఈ 5 ఏళ్లల్లో వయనాడ్ ను పట్టించుకోలేదని,పారిపోయి వచ్చిన ఈ వ్యక్తికి మళ్ళీ ఓట్లు ఎందుకు అంటూ గట్టిగానే రాహుల్ గాంధీపై విరుచుకపడ్డారు.

మొత్తానికి అమేథీలో రాహుల్ ను ఓడగొట్టిన స్మృతీ ఇరానీ ఇప్పుడు వయనాడ్ లో కూడా ఇరుకున పెట్టాలని,రాహుల్ గాంధీ ని వయనాడ్ లో కూడా ఓడగొట్టాలని గట్టి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
జై హింద్!
తప్పకుండా వయనాడులో రాహుల్ గాంధీని ఓడించాలి