విరాట్ కోహ్లి సంచలన ప్రకటన!

టెస్టులకు కోహ్లీ గుడ్‌బై..

విరాట్ కోహ్లీ ఇన్‌స్టాలో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు..
స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. . ‘14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్టు క్రికెట్‌ జెర్సీ ధరించా. ఈ ఫార్మాట్‌ నన్ను ఇంత దూరం తీసుకెళ్తుందని నేనెప్పుడూ ఊహించలేదు.నేను ఆశించిన దాని కంటే ఎక్కువే ఇది నాకు తిరిగిచ్చింది.వెనక్కి తిరిగి నా టెస్టు కెరీర్‌ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కన్పిస్తుంది. ప్రేమతో ఇక సైనింగ్‌ ఆఫ్‌..’ అని కోహ్లీ రాసుకొచ్చాడు.

కోహ్లీ రిటైర్‌మెంట్… మిస్సయ్యే 5 భారీ రికార్డులు ఇవే!
ఆయన ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచే అవకాశాన్ని, టెస్టుల్లో 10,000 పరుగుల మైలురాయిని చేరే అవకాశాన్ని కోల్పోయారు. అత్యధిక టెస్ట్ విజయాల్లో భాగస్వామి కావడం, గెలిచిన మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలవడం, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగుల రికార్డును అధిగమించే అవకాశాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది.

డబుల్ సెంచరీల్లో కోహ్లినే టాప్
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి టెస్టుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.భారత్ తరపున అత్యధిక డబుల్ సెంచరీలు 7 చేసిన ఆటగాడిగా నిలిచారు. కోహ్లి తర్వాత స్థానాల్లో వీరేంద్ర సెహ్వాగ్ 6, సచిన్ 6, ద్రవిడ్ 5, గవాస్కర్ 4, పుజారా 3 ఉన్నారు. టెస్టుల్లో అత్యధిక స్కోరు 254. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత కెప్టెన్ కోహ్లినే.

టెస్టుల్లో విరాట్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అతడి స్థానాన్ని ఏ ఆటగాడు భర్తీ చేస్తాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విరాట్ స్థానాన్ని భర్తీ చేయడానికి కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, దేవత్ పడిక్కల్, రజత్ పటీదార్ లాంటి వారు రేసులో ఉన్నారు.వారిలో ఎవరు ‘కింగ్’ ప్లేస్‌ను రీ ప్లేస్ చేస్తారో వేచి చూడాలి.

ఆల్ ది బెస్ట్ కోహ్లీ🇮🇳🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *