
వడ్డీ రేట్లు సవరించిన RBI
BREAKING: వడ్డీ రేట్లు సవరించిన ఆర్బీఐ వరుసగా రెండో సారి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. దీంతో 6.25 నుంచి 6 శాతానికి రెపో రేటు దిగొచ్చింది.ఈ మేరకు ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఫిబ్రవరిలోనూ వడ్డీ రేట్లను 25 బేసిక్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. దీనివల్ల హోమ్, వెహికల్ పర్సనల్ రుణాలు తీసుకున్నవారికి ప్రయోజనం చేకూరుతుంది.