
RSSకి యజమాని లేడు..కానీ అందరూ యజమానులే!!
సభ్యత్వం లేదు కానీ ఎందరో స్వయంసేవకులు..యజమాని లేడు కానీ అందరూ యజమానులు..ఎవరికింద పనిచేయరు..ఎవరికోసం పనిచేయరు..ఎవరికెవరు ఏమికారూ..ఏమిటోళ్లని ఎవరూ అడగరు..ఎవరికి జై కొట్టరు.. ఎవరికి జిందాబాద్ కొట్టరు..కాషాయ ధ్వజానికి మాత్రమే కట్టుబడి ఉంటారు..ఒక్కటే జెండా..వందలమంది ప్రచారక్( పూర్తి జీవితాన్ని దేశం కోసం,ధర్మం కోసమే అర్పించేవాళ్లు)వేల శాఖలు,లక్షల సంస్థలు,కోట్లాదిమంది కార్యకర్తలు,మద్దతుదార్లు,సానుభూతిపరులు..ఒక్కటే లక్ష్యం…దేశం,ధర్మం,దేశ పునర్వైభవం, భారతమాతకి విశ్వగురుస్థానం..ఘన చరిత్ర సాక్షిగా,క్రమశిక్షణతో,అనామికతో,అనునిత్యం దేశ సేవలో తరించే నిస్వార్థ,నిరాడంబర కార్యదక్షత గల సంస్థ..అనురాగం,అభిమానం,ఆత్మవిశ్వాసం,అచంచల దేశభక్తి నింపుకున్న కార్యకర్తల వ్యక్తిత్వం..ప్రచారం కోరుకోకుండా జీవితాంతం అర్పించే గుణం…