
జాతీయజెండా కోసం బలిదానం అయిన దేశభక్తుడు సామ జగన్మోహన్ రెడ్డి
సామ జగన్మోహన్ రెడ్డి అచంచల దేశభక్తుడుఇంటికి ఒక్క కొడుకు..మధ్యతరగతి కుటుంబం..చదువులో సరస్వతి పుత్రుడు..అందరికీ మిత్రుడు..ధైర్యవంతుడు..శౌర్యవంతుడు.. విజ్ఞానవంతుడు.. దేశమంటే ప్రేమ,భక్తి,గౌరవం..దేశమంటే ప్రాణం…ABVP లో నేర్చుకున్న దేశభక్తి నినాదాలు..వేదాలుగాఘన చరిత్ర సాక్షిగా భారత పునర్వైభవమే లక్ష్యంగాకాకతీయ యూనివర్సిటీలో పాతుకుపోయిన RSU,నక్సలైట్, కమ్యూనిస్టులను ఎదుర్కొన్న ధీశాలి.. తుపాకీ ఎక్కుపెట్టి చంపుతామన్న బెదరని ధైర్యశాలి.RSU,నక్సలైట్ దేశద్రోహులు జనవరి 26న ఎగరేసినజాతీయ జెండాను దించేసి నల్లజెండా ఎగరేసి మళ్ళీ దమ్ముంటే మీ జాతీయజెండాను ఎగరేయమని సవాల్ విసిరితే..అక్కడే ఉన్న యూనివర్సిటీ అధికారులు,పోలీసులు భయపడిన వేళ…..