ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యుద్ధ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం,మోడీజీ ఈ విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కొంటున్నారు అనేది ఈ వ్యాసం ద్వారా చాడ శాస్త్రీ గారు సవివరంగా విశదీకరించి తెలిపారు.వారు రాసినది యథాతథంగా ఇక్కడ కింద ఉంది..పూర్తిగా చదివి దీనిని షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి.
గల్ఫ్ లో యుద్ధం వల్ల ప్రపంచంలో ఆయిల్ క్రైసిస్ అంటే పెట్రోల్ కొరత వల్ల ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి, యుద్ధం ఇంకా కొనసాగితే మనదేశం కూడా ఇబ్బందులు పడుతుంది. మళ్ళీ మనం కరోనా టైమ్ వంటి పరిస్థితులు ఎదుర్కొనే సన్నద్ధం లో ఉండాలి అని నిన్న మోడీ గారు రాజ్యసభ లో చెప్పారు.
ఆయన ఆ మాటలు యధాలాపంగా అని వుండరు గల్ఫ్ యుద్ధం ఇప్పట్లో ఆగే అవకాశం లేదు అని బహుశా ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి అందుకే ఆయన దేశ ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు అని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అమెరికా చర్చలు ఆఫర్ ని ఇరాన్ తిరస్కరిస్తే భారీ ఎత్తున ఇరాన్ మీద దాడులకు అమెరికా వెనుక నుండి భారీ సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆయిల్ సంక్షోభం ఎదుర్కొందికి ఏ ఏ దేశాలు ఏమేమి చర్యలు తీసుకుంటున్నాయో ఒక సారి తెలుసుకోండి. ముందుగా వివిధ దేశాల పెట్రోల్ రేట్లు పెరుగుదల చూడండి.

ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు పెట్రోల్ ధరలు ఎంత పెరిగాయో చూపించే టేబుల్.
ఈ వారంలో చాలా దేశాలు పెట్రో ధరలు మళ్ళీ పెంచాయి.
దేశం Feb-23 Mar-16 % change
ఆస్ట్రేలియా 1.10 1.47 32.4%
పాకిస్థాన్ 0.92 1.15 24.1%
అమెరికా 0.87 1.08 13.3%
ద. కొరియా 1.28 1.45 12.5%
జర్మనీ 2.08 2.34 10.2%
చైనా 1.08 1.19 7.3%
శ్రీలంక 1.10 1.18 5.1%
బ్రిటన్ 1.78 1.87 5.1%
మలేషియా 0.65 0.68 4.6%
బ్రెజిల్ 1.17 1.22 4.3%
భూటాన్ 0.67 0.68 1.5%
ఇండోనేషియా 0.72 0.73 1.4%
జపాన్ 0.99 1.00 1.0%
పెట్రోల్ వినియోగం తగ్గించడానికి దేశాల వారీగా తీసుకున్న చర్యలు:
పాకిస్తాన్ : స్కూళ్లు, కాలేజీలు 2 వారాలు మూసివేశారు. ప్రభుత్వ సిబ్బందికి 4-రోజుల వారం, 50% Work From Home (WFH)
ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లకు ఇంధన కేటాయింపులు 50% తగ్గించారు. అనవసరమైన ప్రభుత్వ వాహనాలు రోడ్లపైకి రాకుండా నిషేధించారు.
శ్రీలంక : బుధవారం రోజున కూడా పబ్లిక్ హాలిడే గా ప్రకటించారు. అంటే స్కూళ్లు, యూనివర్సిటీలు, అనవసరమైన ప్రభుత్వ ఉద్యోగులకు. నేషనల్ ఫ్యూయల్ పాస్ (QR-based rationing) మళ్లీ ప్రవేశపెట్టారు
ప్రైవేట్ వాహనాలకు వారానికి 15 లీటర్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు 200 లీటర్లు మాత్రమే.
బంగ్లాదేశ్ : అన్ని యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు ఆన్‌లైన్‌కు మార్చారు (విద్యుత్ లోడ్ తగ్గించడానికి) మార్చి 8 నుంచి ఇంధన రేషనింగ్ అమలు చేశారు. ఇంటి విద్యుత్ కోసం 5 గంటల రోలింగ్ బ్లాక్‌ఔట్స్. గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ యూనిట్లు మూతపడ్డాయి. 5 లో 4 స్టేట్ ఫర్టిలైజర్ ప్లాంట్లు గ్యాస్ లోటు వల్ల మూసివేశారు.
భూటాన్ : క్యాన్లలో ఇంధన అమ్మకాలపై బ్యాన్.
వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్టివేట్ చేశారు.
ఇంధన రేషనింగ్ పెట్టారు. ఎమర్జెన్సీ సర్వీసులకు ప్రాధాన్యత.
ఫిలిప్పీన్స్ : ప్రభుత్వ సిబ్బందికి 4-రోజుల వారం
ప్రైవేట్ సెక్టర్‌ను వర్క్ ఫ్రమ్ హోమ్ అవలంబించమని చెప్పారు.
అనవసరమైన పబ్లిక్ సెక్టర్ ట్రావెల్‌పై బ్యాన్.
మయన్మార్ : ప్రైవేట్ వాహనాలకు Odd-Even స్కీమ్ ప్రవేశ పెట్టారు.
కంబోడియా: సుమారు 6,300 పెట్రోల్ స్టేషన్లలో మూడింట ఒక దానిని మార్చి మధ్యలో మూసివేశారు.
లావోస్ : సివిల్ సర్వెంట్లకు వర్క్ ఫ్రమ్ హోమ్.
రొటేషనల్ వర్క్ షిఫ్ట్‌లు (కమ్యూటింగ్ తగ్గించడానికి)
దక్షిణాఫ్రికా :
“Controlled allocation measures” – డీజిల్ లభ్యత అనే బోర్డ్స్ చాలా ప్రావిన్సుల్లో ఆఫ్ అయ్యాయి.
ఈజిప్ట్ : మార్చి 28 నుంచి ప్రభుత్వ ఆఫీసులు సాయంత్రం6 గం.లకు మరియూ మాల్స్ రెస్టారెంట్లు, ఇతర రిటైల్ షాప్స్ రాత్రి 9 గం.లకు మూసేయాలి.
కెన్యా : పెట్రోల్/డీజిల్ రేషనింగ్ పెట్టారు
ఎగుమతులపై బ్యాన్ ప్రకటించారు.
న్యూజిలాండ్ :
Air New Zealand 1,000+ ఫ్లైట్లు రద్దు చేసింది (జెట్ ఫ్యూయల్ ధరలు ఎక్కువ కావడంతో)
1979 యుగం “car-less day” పాలసీని పరిశీలిస్తున్నారు
స్లోవాకియా : డీజిల్ కొనుగోలుపై కోటాలు అమలులో పెట్టారు. అంటే రేషనింగ్ పెట్టారు.
స్లోవేనియా :
కార్లకు 30 లీటర్లు, ట్రక్కులకు 200 లీటర్లు రేషనింగ్ పెట్టారు.

చాలా దేశాల్లో రెస్టారెంట్లు & రిటైల్ అవుట్‌లెట్లు వారాంతపు రోజుల్లో రాత్రి 9 గంటలకు మూసేయాలి. ప్రభుత్వ భవనాలు సాయంత్రం 6 గంటలకు మూసేయాలి.
ఇంధన పొదుపు చర్యలు లో భాగంగా ‘అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ'(IEA) అన్ని దేశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్, కార్లకు ఆడ్-ఈవెన్ రోజులు పెట్టడం మరియు విమాన ప్రయాణాలు తగ్గించుకోవాలి అని సూచనలు చేసింది.
భారత్ లో ప్రస్తుతానికి పెట్రోల్/డీజల్ కొరత రేషనింగ్ లేదు కాబట్టి IEA సూచనలు అమలు చేయడం లేదు.
చాలా దేశాల్లో లాగా సాధారణ పెట్రోల్-డీజిల్ ధరలు పెంచలేదు. కానీ ప్రీమియం పెట్రోల్ (XP95, Speed, Power వంటివి) మాత్రం Rs.2.09 నుంచి Rs.2.35 వరకు పెంచారు.
LPG కొరత వల్ల హోటెల్స్, రెస్టారెంట్లు కి రేషనింగ్ ఉంది గృహ అవసరాలకు ఆలస్యంగా అయినా సప్లై చేస్తున్నారు.

25 రోజులు అయి యుద్ధం ప్రారంభం అయింది. అమెరికా, యూకే మరియు జస్ట్ 50 లక్షల జనాభా గల న్యూజిలాండ్ వంటి ధనిక దేశాలు కూడా పెట్రో ధరలు పెంచి, పొదుపు చర్యలు తీసుకుంటూ ఉంటే, ఆ దేశాలతో పోలిస్తే 140 కోట్ల జనాభా గలిగి, ఆ దేశాల తలసరి ఆదాయాలతో పోలిస్తే బాగా తక్కువ ఉన్న భారత్ పెట్రోల్ డీజిల్ సరఫరా విషయం లో ప్రస్తుతం వరకు చాలా గొప్పగా మేనేజి చేస్తోంది అని ఒప్పుకోక తప్పదు.
…..చాడా శాస్త్రి…..
