బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంతే… అంజన్న ఆశీర్వాద యాత్రతో మరోసారి నిరూపణ
“మేడం సర్… మేడం అంతే” అని అల వైకుంఠపురంలో సినిమాలో వచ్చే డైలాగ్ లాగానే…
“బండి సంజయ్ సర్… బండి సంజయ్ అంతే” అని మరోసారి నిరూపించుకున్నారు బండి సంజయ్ కుమార్. రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ తెలంగాణను ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేసాడో చూసాం..తెలంగాణ రాజకీయాల్లో అప్పుడు,ఇప్పుడు బండి సంజయ్ ఎప్పుడూ సంచలనమే..ఇప్పుడు కూడా మళ్ళి అదే ట్రెండ్ క్రియేట్ చేసాడు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగిన సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుని మేయర్ పీఠాన్ని గెలుచుకుంది.

ఈ విజయానికి ముందు ఎన్నికల సమయంలో చేసిన మొక్కును నెరవేర్చుతూ, మేయర్ పదవి గెలిస్తే కొండగట్టు వరకు పాదయాత్రగా వస్తానని బండి సంజయ్ మాటిచ్చారు.ఇచ్చిన మాటకు,మొక్కుకు కట్టుబడి,నిలబడి దానిని నెరవేర్చేందుకు నడుంబిగించారు.తనతో పాటు గెలిచిన ప్రజా ప్రతినిధులను,కష్టపడ్డ కార్యకర్తలను వెంటబెట్టుకొని వేలాదిమంది కార్యకర్తలతో కలిసి కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయం నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు.
అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో 40 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కొండగట్టు అంజన్న ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు.శ్రీ మహాశక్తి ఆలయంలో పూజలు చేసి ముగ్గురమ్మల ఆశీర్వాదం తీసుకొని యాత్రను ప్రారంభించాడు కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్.

40 డిగ్రీల ఎండలో 40 కిలోమీటర్ల పాదయాత్ర
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పాదయాత్ర రాత్రి 9 గంటలకు ముగిసింది. దాదాపు 40 కిలోమీటర్ల దూరాన్ని 40 డిగ్రీల ఎండలో బండి సంజయ్ నడిచారు. ముఖ్యంగా ఈ యాత్రలో ఆయన కాళ్లకు చెప్పులు లేకుండా, షూస్ లేకుండా కేవలం సాక్సులతోనే నడవడం ప్రత్యేకంగా నిలిచింది.40 కిలోమీటర్లు ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా నడవడం మాములు విషయం కాదు.ఎంత కమిట్మెంట్,మొండి పట్టుదల ఉంటే తప్ప ఇలా ఎవరూ చేయరు.చెప్పులతో,షూతో చేసినా తనని అడిగేవారు ఎవరూ లేరు..కానీ పవిత్రంగా,నిబద్దతతో,నిష్ఠతో ఎండను సైతం తట్టుకొని పాదయాత్ర చేపట్టాడు.

ఇది ఆయన అంజన్నపై ఉన్న భక్తి, తన మాటపై ఉన్న నిబద్ధతను మరోసారి చూపించింది.
యాత్ర సాగిన మార్గం
శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రారంభమైన ఈ యాత్ర కింది ప్రాంతాల మీదుగా సాగింది:
- ఆర్టీసీ వర్క్ షాప్
- రేకుర్తి
- కొత్తపల్లి
- వేదిర
- రామడుగు
- కురిక్యాల
- గంగాధర
- పూడూరు
- మల్యాల
- కొండగట్టు
వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఈ యాత్ర ఉత్సాహంగా కొనసాగింది.

ప్రజల నుంచి విశేష స్పందన
యాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు స్వచ్చంద సంస్థలు, స్థానిక ప్రజలు అడుగడుగునా అండగా నిలిచారు.
వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు అందిస్తూ కార్యకర్తలకు సహాయం చేశారు.
కురిక్యాల వరకు చేరుకునే సమయానికి ఎండ వేడితో బండి సంజయ్ కాళ్లకు బొబ్బలు రావడంతో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం గంగాధరలో కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేసి, కొద్దిసేపటి తర్వాత యాత్రను తిరిగి ప్రారంభించారు.
గ్రామాల్లో ప్రజలు డప్పు చప్పుళ్లతో, కోలాటాలతో, గజమాలలతో, పూల వర్షంతో బండి సంజయ్‌కు ఘన స్వాగతం పలికారు.

యాత్రలో హైలైట్ సంఘటనలు
గంగాధర చౌరస్తాలో బుల్డోజర్లతో చేసిన స్వాగతం మొత్తం యాత్రకు హైలైట్‌గా నిలిచింది.వేలాదిమంది కార్యకర్తలు,ప్రజల మధ్యన ఈ బుల్డోజర్ స్వాగతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దూకుడుని గుర్తు చేసింది.బుల్డోజర్ పై నుంచి కార్యకర్తలు బండి సంజయ్ పై పూల వర్షం కురిపించారు.బుల్డోజర్ మెరుపులతో గంగాధరని మెరిపించారు.బుల్డోజర్ స్వాగతానికి మురిసిన బండి సంజయ్ మీడియాకి కేటాయించిన వాహనం ఎక్కి చౌరస్తాలో గుమిగూడిన ప్రజలకు అభివాదం చేసి వారిని ఉత్సాహపరిచి కార్యకర్తల్లో జోష్ నింపారు.
యాత్ర మొత్తం కూడా ప్రజా రవాణాకు,ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా,రాకుండా పోలీసులు,కార్యకర్తలు సహకరించారు.యాత్ర వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో,ప్రవేట్ వాహనాల్లో వెళ్తున్న ప్రజలు బండి సంజయ్ కి చేతులు ఊపి,చిరునవ్వులు చిందిస్తూ జై శ్రీరామ్ అంటూ నమస్కారాలు చెప్పారు.

రామడుగులో డ్రోన్ అనుకోకుండా తేనెటీగల గూడు తగలడంతో కొంతమంది కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. వెంటనే బండి సంజయ్ వెంట వచ్చిన అంబులెన్స్‌లో వారికి చికిత్స అందించారు.
భారీగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
యాత్ర మొత్తం మార్గంలో కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు పెద్దఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు.యాత్ర మార్గం మొత్తం కాషాయ తోరణాలతో కాషాయవనాన్ని తలపించింది.మొత్తం కరీంనగర్ పార్లమెంట్ అన్ని మండలాల నుంచి వాహనాలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలు,నాయకులు స్వచ్చందంగా తరలివచ్చారు.కొందరు మహిళా కార్యకర్తలు స్వామి కార్యం,స్వ కార్యం అన్నట్టు 40కిలోమీటర్లు బండి సంజయ్ కి మద్దతుగా వచ్చినట్టే తమ ఇష్ట దైవమైన కొండగట్టు అంజన్న కోసం పాదయాత్ర చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర నాయకులు, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు మరియు దాదాపు 10 వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

మీడియాతో బండి సంజయ్ వ్యాఖ్యలు
యాత్ర ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, అంజన్న ఆశీర్వాదం కోసం ఈ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ముందుగా మీరు హిందువా, క్రిస్టియన్‌వా చెప్పాలని ప్రశ్నించారు. మతం మారి దేవుడిని కూడా మోసం చేసిన వ్యక్తిని తుంగతుర్తిలో ఓడగొడతామని హెచ్చరించారు.తాగి సభలో మాట్లాడిన బూతు మాటలకు,హిందూ ధర్మంపై,బ్రాహ్మణులను తిడుతూ మాట్లాడితే వేదిక మీదున్న కాంగ్రెస్ నాయకులు చప్పట్లు కొట్టడం,నవ్వడం కాంగ్రెస్ పార్టీకి హిందువుల మీద ఉన్న విషాన్ని నిజం చేసింది అన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ హిందూ వ్యతిరేక నిజాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే హిందూ ధర్మంపై విషం కక్కుతున్నారని విమర్శించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అలాగే 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పి యాత్రను ప్రారంభించారు.
చరిత్ర సృష్టించిన పాదయాత్ర
మొత్తంగా చూస్తే, ఒకే రోజు 40 డిగ్రీల ఎండలో 40 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బండి సంజయ్ మరియు బీజేపీ కార్యకర్తలు ఒక ప్రత్యేక చరిత్ర సృష్టించారు.
ఈ ఆర్టికల్ మీకు నచ్చితే మరింతమందికి షేర్ చేసి మన జాతీయవాద rightvoice.in వెబ్సైట్ ను ప్రోత్సహించి సపోర్ట్ చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి.భారత్ మాతాకీ జై
