Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

ఆడబిడ్డలకి 10116/-రూపాయలు ఇస్తున్న బీజేపీ యువ నాయకుడు

Praveen Reddy Naredla, 20/02/202620/02/2026
Spread the love
     

రాజకీయాల్లో గెలవడానికి ఎన్నెన్నో హామీలు,మాయమాటలు చెప్పి గెలుస్తుంటారు.గద్దెనెక్కుతారు..మెజారిటీ నాయకులు ఇచ్చిన హామీలను అసలు గుర్తు పెట్టుకోరు..పెట్టుకున్నా అమలు చేయాలనే ఆలోచన,ఆచరణ ఉండవు..
అలాగే ఓటు వేసేదేకా ఓటర్లను ఏవేవో చెప్పి ప్రసన్నం చేసుకుంటారు..ఓటు వేసాక,గెలిచాక పనుల కోసం వస్తే తిప్పించుకుంటారు..ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ నాయకుల ఊసరవెల్లి ముచ్చట్లు ఒడవవు..
కానీ హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో లో బీజేపీ నుంచి గెలిచిన కౌన్సిలర్ పంజాల మనోజ్ గౌడ్ మాత్రం తాను అందరిలాగా కాదు నేను డిఫరెంట్ అని నిరూపించాడు.
గెలిచి వారం కూడా కాకముందే ఇచ్చిన హామీలను అమలు చేసేస్తున్నాడు.


వివరంగా చెప్పుకుంటే పంజాల మనోజ్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ 21వ వార్డు నుంచి బీజేపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచాడు.ఎన్నికల ప్రచారంలో వార్డు అభివృద్ధి కోసం మ్యానిఫెస్టో కూడా పెట్టాడు..అందులో అందరినీ ఆకర్షించిన రెండు హామలు మనోజ్ సేవాభావాన్ని తెలియజేసాయి.

  1. ఆడబిడ్డ పుడితే 10116/-రూపాయలు ఫిక్సుడ్ డిపాజిట్ చేస్తానని..
  2. ఆడబిడ్డ పెళ్లికి 10116/-రూపాయలు కానుకగా ఇస్తానని..
    తన మ్యానిఫెస్టో ఇది..

హామీ ఇవ్వడం వేరు..అమలు చేయడం వేరు..
కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి పెళ్లి కుదిరిన ఆడబిడ్డకు 10116/- రూపాయలు కానుకగా ఇచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు..ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజలతోటి శభాష్ అనిపించుకుంటున్నాడు.

మనోజ్ కేవలం ఎన్నికల కోసమే,గెలవడం కోసమే ఇలాంటి హామీలు ఇవ్వలేదు.చాలా ఏళ్లుగా పేదవారికి,పేదపిల్లలకి అండగా నిలుస్తున్నాడు.తనకు అవకాశమున్నంత వరకు ఆసరా అవుతాడు..అన్న అవుతాడు.ముద్దుగా ఆ వార్డు ప్రజలు మనోడిని,మనోజ్ ని బంటి అని పిలుసుకుంటారు.గ్రేట్ బంటి భాయ్..కీప్ అప్ ది గుడ్ వర్క్


Spread the love
     
 
      
News National Telangana 10116 rupeesBjpBJYMHuzurabadPanjala manojPanjala Manoj Goud

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • మోడీజీ మన్ కీ బాత్ –Modi ji Mann ki baat
  • 2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్
  • కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి రాజీనామా-ఎమోషనల్ లేఖ !!
  • ప్రపంచాన్ని మెప్పించిన మోడిజీ
  • బీజేపీ స్టాంప్ నిజమేనా ?

Recent Comments

  1. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  2. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

Archives

  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | Terms & Conditions | Privacy Policy | Disclaimer