Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్

Praveen Reddy Naredla, 26/03/202626/03/2026
Spread the love
     

దేశ సమస్యలను గుర్తించడం భవిష్యత్ లో వాటి తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేసుకుంటూ పోవడం అనేది సీరియస్ గా నిజయితీ గా పని చేసే ఒక నాయకుడు లక్షణం.

మోడీ 2014లో వచ్చాక దేశంలో ప్రతీ రంగంలోనూ ఇలాగే శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికా బద్ధంగా ఉన్న నిధులతో మెల్లి మెల్లిగా అడుగులు వేస్తున్నాడు. 2014 తర్వాత మోడీ క్రూడ్ ఆయిల్ వినియోగం తగ్గించి తద్వారా క్రూడ్ దిగుమతులకు విదేశాలు మీద ఆధార పడటం తగ్గిస్తూ, దాని ద్వారా ఫారెన్ ఎక్స్చేంజి పొదుపు చసే ప్రయత్నాలు చేస్తున్నారు.

క్రూడ్ అయిల్/గాస్ దిగుమతులు తగ్గించడానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యక్ష/పరోక్ష ఆయిల్ రంగ ముఖ్య సంస్కరణలు ముఖ్యంగా మెయిన్ మీడియా చెప్పనివి, ఎవరూ పెద్దగా చర్చించని అంశాలు చూడండి:

  1. హై వేలు భారీగా నిర్మిస్తూ వాహనాల ఇంధనం, సమయం ఆదా అయ్యేటట్లు చూడటం
  2. 2014 కి భారత్ రైల్వే నెట్ వర్క్ లో విద్యుత్ మీద నడిచే 30-35% నెట్ వర్క్ ని దాదాపుగా 100% విద్యుత్ మీద నడిచేటట్లు చేశారు. రైల్వేలో డీజిల్ వినియోగం భారీగా తగ్గింది.
  3. GST పెట్టి రాష్ట్రాల మధ్య టోల్ గేట్స్ తీసేసి వాహనాలు గంటల తరబడి ప్రయాణ ఆలస్యం తగ్గించి ఆయిల్ ఆదా చేయడం.
  4. వ్యవసాయం నుండి ఇధానాల్ ఉత్పత్తి పెంచి ఆయిల్ లో 15-20% కలుపుతూ అంత మేర క్రూడ్ వినియోగం, దిగుమతులు తగ్గించడం. వ్యవసాయ దారుల ఆదాయం పెంచడం.
  5. ప్రపంచంలో క్రూడ్ ధరలు తగ్గినా ఇక్కడ తగ్గించకుండా ఆ డబ్బులు కొంత ఉపయోగించి సుమారు 10రోజులకు సరిపోయే (స్టేటజిక్ పెట్రోల్ రిజర్వ్) SPR ఏర్పాటు చేయడం. మన్మోహన్ ప్రభుత్వ కాలంలో పెట్రోల్ డీజిల్ చవగ్గా ఇవ్వడానికి అని ఆయిల్ కంపెనీల కు బాకీ పెట్టిన సుమారు ₹1,30,000కోట్లు వడ్డేతో కలిపి ₹3,00,000కోట్లు తిరిగి చెల్లించడం అయిల్ కంపెనీలను నష్టాల నుండి దివాళా స్థితి నుండి తప్పించి బలోపేతం చేయడం.
  6. గాస్/డీజిల్ ద్వారా తయారు అయ్యే విద్యుత్తు బదులు వాటి అవసరం లేని సోలార్ విండ్ ఎనర్జి భారీగా పెంచడం. ఇది మోడీ ప్రభుత్వం ఎంతలా పెంచింది అంటే 2014లో సోలార్ విద్యుత్ 3GW ఉత్పత్తి అయితే ఇప్పుడు143 GW ఉత్పత్తి అవుతోంది.
  7. సబ్సిడీ లు ఇస్తూ విద్యుత్ వాహనాలు వాడుక పెంచడం.ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఆటోలు, టాక్సీలు, విద్యుత్ సిటీబస్ లు ప్రోత్సాహకాలు ద్వారా పెంచడం.

ఇవి అతి ముఖ్యమైనవి. పైన చెప్పుకున్న ప్రతీ పాయింట్ గురించి పూర్తి ఆధారాలు తో వేరే వేరే పోస్ట్స్ పెడతాను చూడండి.

అంటే 2014 తో పోలిస్తే దేశంలో వాహనాలు సంఖ్య భారీగా అంటే 4-5 రెట్లు పెరిగింది. క్రూడ్ దిగుమతులు కూడా అంత భారీగా పెరగాలి. కానీ మోడీ ప్రభుత్వం తీసుకున్న పై చర్యలు తర్వాత 2014 తో పోలిస్తే క్రూడ్ వినియోగం/దిగుమతులు 10% మాత్రమే పెరిగాయి. సంస్కరణలు లేకపోయి ఉంటే క్రూడ్ డిమాండ్ 25-30% వరకు పెరిగి ఉండేది. అంటే దేశంలో క్రూడ్ వినియోగం ఎంత భారీగా పెరిగిందో ఊహించండి. ఈ పై చర్యలు తీసుకోకుండా ఉంటే క్రూడ్ డిమాండ్ ఇంకా ఎంత ఎక్కువ పెరిగి ఇప్పుడు ఎంత దారుణ పరిస్థితులు ఉండేవో ఊహించండి. మరొక మాట, శుద్ధి చేసిన క్రూడ్ లో డీజిల్ ఎక్కువగా వినియోగించే రైల్వే కు, వివిధ రాష్ట్రాల RTC వాళ్లకు కేటాయిస్తే, మిగతా వారికి డీజిల్ కొరత వచ్చే పరిస్థితి ఉండేది.

2004-14 ముందు కూడా క్రూడ్ దిగుమతులు సమస్య ఇంత తీవ్రంగా నూ ఉండేది. ఇలా మోడీ తీసుకున్న చర్యలు వంటివి మన్మోహన్ ప్రభుత్వం ఏం తీసుకుందో ఎవరైనా చెపితే ప్రభుత్వాల పని తీరు పోల్చడానికి బాగుంటుంది.

మనం చదువుకున్న వాళ్ళం. వార్తలు చదివి లేదా విని విశ్లేషణ చేసి నిజాలు తెలుసుకునే జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు. కానీ, మోడీ మీదనో బిజెపి మీదనో ద్వేషం చేత అబద్దాలు ప్రచారం చేస్తే మోడీకి వ్యక్తిగతంగా నష్టం ఉండదు, దేశం తద్వారా మనం మన ముందు తరాలు నష్టపోతాయి.

….చాడా శాస్త్రి…


Spread the love
     
 
      
News 2014BjpcoronacrisisdemonetizationDevelopmentIndiaModi

Post navigation

Previous post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • 2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్
  • కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి రాజీనామా-ఎమోషనల్ లేఖ !!
  • ప్రపంచాన్ని మెప్పించిన మోడిజీ
  • బీజేపీ స్టాంప్ నిజమేనా ?
  • భారీగా ఎంపీ,ఎమ్మెల్యే స్థానాల పెంపు

Recent Comments

  1. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  2. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

Archives

  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | Terms & Conditions | Privacy Policy | Disclaimer