వికసిత భారతమే మోదీ లక్ష్యం
నాయకులు ఎంతో మంది వస్తుంటారు.. వెళ్తుంటారు. ప్రజానాడి గెలిచిన నాయకులు శాశ్వతంగా ఉంటారు. పూటకో పార్టీ పుడుతుంది.. పూటకోకరు నేను నాయకుడిని అంటారు. కానీ.. జనం మెచ్చిన నాయకులంటూ కొందరుంటారు. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన నేతలు వారి పేరును చెరిపేసుకోలేరు. తాను నడుస్తూ.. జనాన్ని తనతో కలిసి నడిపించే నేతలు కొందరే ఉంటారు. పదవులు అందరికీ వస్తుంటాయి.. కానీ పదవికి వెన్నెతెచ్చిన నాయకులు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇప్పుడు దేశంలో అదే నడుస్తోంది. మోదీ హవా విశ్వవ్యాప్తమై గంగా ప్రవాహంలా ప్రవహిస్తోంది.
ఇటు దేశంలో అటు ప్రపంచంలో.. మోదీ హవా కొనసాగుతోంది. దేశానికి ఈ నాయకుడు ఉండాలి అంటూ ప్రజలు నినదిస్తున్నారు. నరేంద్ర మోదీ పరిపాలనపై మెజార్టీ ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. దేశంలో ఏపార్టీ కూడా సాధించని కీర్తిని బీజేపీ ఈ పదేళ్లలో సాధించింది. ఈ ఘనత.. పార్టీ చరిష్మా అనడం కంటే.. మోదీ చరిష్మానే అని చెప్పాలి. మోదీని ఇప్పుడు దేశం పార్టీ నాయకుడి కంటే.. దేశనాయకుడిగానే చూస్తుంది. అవును.. ఏపార్టీకైనా స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తుంది. టార్గెట్‌ను రీచ్ అవ్వడంలో కొన్నిదఫాలు విఫలం కావొచ్చు కానీ.. లక్ష్యాన్ని చేరుకోవడం పక్కా అని చెప్పవచ్చు. అది మోదీ నిర్ణయాలలో సుస్పష్టమవుతోంది.
మోదీ లైఫ్ జర్నీ అందరికి తెలిసిందే.. ఆయన జీవిత ప్రయాణం ప్రతి పొలిటికల్ లీడర్‌కు ఆదర్శమే. అత్యంత సాధారణమమైన జీవనాన్ని ఆయన గడిపారు. ఆర్ఎస్ఎస్‌లో వర్క్ చేసారు. చాయ్ వాలగా పని చేశారు. 1986లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2002 నుంచి 2012 వరకు గుజరాత్ సీఎంగా ఆయన పదవీబాధ్యతలు చేపట్టారు. అనంతరం.. 2014లో దేశప్రధానిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అటు గుజరాత్ సీఎంగా తాను తెచ్చకున్న మార్క్, చేసిన అభివృద్ధి, ఆయన పనితీరు, బాధ్యతపట్ల ఆయనకున్న నిబద్ధతలే.. దేశ ప్రధానిగా బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేశాయని చెప్పవచ్చు. ఇక ప్రైమ్ మినిస్టర్ అయ్యాక.. మోదీ క్రేజ్ మరింతగా పెరిగింది. ఆయన వేవ్.. సుడిగాలిలా దేశ వ్యాప్తంగా వ్యాపించింది.
దేశ సంక్షేమానికి సంబంధించి ఏదైనా విషయంపై ఆయన టార్గెట్ పెట్టుకున్నారంటే.. వ్యతిరేకత వచ్చినా.. విమర్శలు ఎదురైనా ముందుకుసాగిపోతారు. విపక్షాల ఎటాక్‌ను ఆయన తిప్పికొడతారు. ఎంత సైలెంట్‌గా తన వర్క్ చేసుకుంటూ వెళ్తారో.. సమయం వచ్చినప్పుడు తన విశ్వరూపాన్ని చూపిస్తారు. సాధరణంగా ఏపార్టీ అయినా.. పదేళ్లు పరిపాలన అంటే విమర్శలు, వ్యతిరేకత ప్రజల్లో ఉంటుంది. కానీ.. గడిచిన 10ఏళ్లలో మోదీపై వ్యతిరేకత కంటే.. సద్భావనే ఎక్కువగా పెరిగింది. మోదీ తీసుకునే నిర్ణయాలు మొదలు.. వాటిని అమలు చేసే రీతిపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. పదేళ్ల క్రితం భారతదేశం వేరు.. పదేళ్ల తర్వాత… నేడు మనం చూస్తున్న భారతదేశం వేరు అనేది క్లియర్ కట్‌గా అవుపడుతున్న సాక్ష్యం.
గడిచిన పదేళ్ల క్రితం.. భారత్‌కు అంత ప్రాధాన్యత ఇవ్వని దేశాలు కూడా ఇవాళ భారత్ పేరు చెప్పగానే.. నరేంద్ర మోదీ పేరు వినగానే.. అతిధిమర్యాదలు ఇస్తున్నాయి. గత 65ఏళ్లు వేరు.. ఇప్పుడు భారతదేశం స్థితి వేరు. ప్రపంచదేశాలకు పోటీ పడుతూ.. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. భారత్ యుద్ధాలు ఆపగలదు. భారత్ దేశాలమధ్య సయోధ్య కుదర్చగలదు. భారత్ ప్రపంచదేశాలకు ఆపద వచ్చిందంటే ప్రాణదానాలు చేయగలదు. భారత్ యోగా చేస్తే.. ప్రపంచం అనుసరించగలదు. భారత్ నమస్కారం పెడితే.. ప్రపంచదేశాలు ప్రతినమస్కారం పెట్టగలవు. భారత్ ప్రపంచదేశాల అగ్రరాజ్యాల జాబితాలో మొదటి వరుసలో ఉండగలదు. విశ్వశాంతి కొరకై.. భారత్ చెప్పింది నేడు అగ్రరాజ్యాలు వినగలవు, పాటించగలవు, అనుసరించగలవు. ప్రపంచ వేదికలపై రిచెస్ట్ కంట్రీలుగా వెలుగొందుతున్న దేశాలు సైతం.. భారత్ స్పందనకు ఎదురుచూస్తాయి. ఇది ఒక్కరోజుతో వచ్చింది కాదు, ఒక్క పూటతో వచ్చింది కాదు. నిత్యం.. నిరంతరం.. 24 బై 7ఆయన శ్రమతోనే వచ్చింది. రోజుకు 18 గంటలు కష్టపడితేనే సాధ్యమైంది. ఇటు దేశంలో ప్రజానాడిని పట్టుకొని ప్రజామద్దతు కూడగుడుతూనే.. అటు ప్రపంచ దేశాల్లో భారత్ ఖ్యాతిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం అంటే.. అది మోదీకే సాధ్యమైంది. ఇలాంటి ప్రధానమంత్రిని గతంలో ఎప్పుడైనా చూశామా..? సాహసోపేతమైన నిర్ణయాలల్లో ఇంత దూకుడుగా వ్యవహరించిన ప్రధానమంత్రులు ఉన్నారా..
దేశానికి మేలు కోరే ఏ నిర్ణయమైనా ఆయన ముందుకెళ్తారు. ఏళ్ల తరబడి మతాల మధ్య చిచ్చుపెడుతూ ఉన్నటు వంటి అయోధ్య రామాలయం సమస్య ఈ పదేళ్ల కాలంలో సద్ధుమనిగింది. దేశాన్ని నిత్యం రణక్షేత్రంలా.. దాయాది దేశం నుంచి ఎప్పుడు ఏ ఆటంకం ఎదురవుతుందోనన్న సమస్యతో ఉన్న కశ్మీర్‌కు ఆర్టికల్ 370రద్దు చేసి స్వేచ్ఛవాయువులు ఇచ్చారు. నోట్ల రద్దుతో దేశంలో తోలుత వ్యతిరేకత మొదలైనా.. ప్రజలను ఆయన వైపు తిప్పుకోగలిగారు. జీఎస్టీతో పేదల నడ్డివిరుస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెట్టినా.. మోదీ దాన్ని కొట్టిపారేసారు. ఇంధన ధరలు పెంచి పెట్టుబడిదారులకు లాభం చేకూరుస్తున్నారని మోదీ రాజకీయ శత్రువులు ఆరోపించినా.. వీరి మాటలను ప్రజలను అనుకున్నంత రీతిలో నమ్మలేకపోయారు. ఇక సీఏఏ, ఎన్నార్సీని తీసుకొచ్చారు. సీఏఏపై మోదీపై వ్యతిరేకత తీసుకురావాలని విపక్షం భావించినా.. దాన్ని బీజేపీ సాధ్యమైనంత తొందరగానే ప్రజలకు స్పష్టమైన వివరణ ఇచ్చింది. ముస్లీం మహిళలకు పెనుభూతంలా మారిన త్రిపుల్ తలాక్‌ను ఆయన రద్దు చేసి.. మైనార్టీ వర్గాల మహిళల సానుభూతిని మోదీ చూరగొన్నారు. ఇప్పుడు దేశంలో ఎటు నుంచి చూసినా.. నరేంద్రుడికి మరోమారు అధికారం పక్కా అనేది అర్థమవుతోంది. ఆయన కాక ప్రజలకు మరో ఆల్టర్నేట్ వ్యక్తికూడా అవుపడని పరిస్థితి. 2014కు ముందు ఉన్న ఉగ్రవాదం పరిస్థితి.. ఇవాళ్టి ప్రసెంట్ పరిస్థితి చూస్తూ.. దేశంలో ఎంత మేర టెర్రరిజం తగ్గిపోయిందో ప్రజలకు తెలిసిన విషయమే. గతంతో పోల్చితే.. దేశంలో మతకల్లోలు లేవు, మారణహోమాలు లేవు. ఇవన్నీ కూడా కేంద్రంలోని మోదీ సర్కార్‌తోనే సాధ్యమైందని చెప్పాలి.
విపక్షానికి నాయుకుడు లేడు. విపక్షాన్ని నడిపించే నేత లేడు. అందులో అందరూ లీడర్లే.. అందులో అందరూ ప్రధానమంత్రి క్యాండెంట్లే. వారి లక్ష్యం మోదీని ఓడించడమే. మరి మోదీని ఓడించేందుకు సరైనా ప్రణాళికా ఉందా అంటే ఆన్సర్ లేదు. ఏవిషయంలో మోదీ ఈ దేశానికి ప్రమాదకరం అన్న విషయాన్ని ప్రజలకు చెప్పడంలో ఇండియా కూటమి పూర్తిగా విఫలమైంది. కూటమి ఏర్పడిన నాడు ఉన్న పార్టీలు.. నేటికి దూరమైతూనే ఉన్నాయి. అప్పటికప్పుడే కలిసి ఉంటాం అంటారు. కలిసే పోటీ చేస్తామంటారు.. అంతలోనే.. సీట్ల పంపకాలు వచ్చే సరికి ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చిచెప్తారు. దీంతో.. అసలు కూటమి ఉందా.. నిజమైన ప్రతిపక్షపాత్రను పోషిస్తుందా.. అంటే లేదనే చెప్పాలి. అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలన్నా.. ప్రభుత్వాన్ని నిలదీయాలన్న.. విపక్షమే బలమైన అస్త్రం. కానీ ఆవిపక్షమే.. సరిగ్గా లేనప్పుడు.. కూటమి పోటీ చేసేది ఎక్కడా.. గెలిచి నిలిచేద ఎక్కడా అనేది ప్రజలకు తెలియనిదా.?
విపక్షంలో ఉన్న కాంగ్రెస్ దేశసమైక్యతకు, సంక్షేమానికి సంబంధించిన ప్రతిబిల్లును వ్యతిరేకించింది. అక్కడే అర్థమైంది.. విపక్షం లక్ష్యం మోదీని వ్యతిరేకించడమే కానీ.. దేశ సంక్షేమం ముఖ్యం కాదని. ఆర్టికల్ 370 రద్దు చేయడమే సరైన నిర్ణయమని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అలాంటి నిర్ణయంలో కూడా విపక్షంలో ఉన్న కాంగ్రెస్ తన వైఖరిని నిరూపించుకుంది. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్పప్పుడు ఆర్టికల్ 370ని రద్దు చేసే పరిస్థితి ఉన్నా.. కావాలనే చేయలేదు అనేది న్యాయస్థానం జడ్జిమెంట్‌తో ప్రజలకు అర్థమైంది. త్రివర్ణపతకాం ఎగరని చోట.. ఇవాళ వందేమాతరం నినాదాలు, భారత్ మాతాకీ జై అంటూ జయకారాలు వినపడుతున్నాయంటే.. అది కేవలం మోదీ వల్లే సాధ్యమైంది. డిజిటల్ ఇండియా అని మోదీ అంటే… ఎద్దేవా చేసిన కాంగ్రెస్.. నేడు డిజిటల్ పేమెంట్స్ లావాదేవీలు సామాన్యుడికి సైతం చేరువయ్యింది చూసి.. ఏం చెప్పాలో కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. సీఏఏ, త్రిపుల్ తలాక్, ఎన్నా్ర్సీ, ఎన్ఈపీలపై దేశ ప్రజల నుంచి వ్యతిరేక పవనాల తీసుకురావాలని చూసిన కాంగ్రెస్ అక్కడా కూడా పూర్తిగా విఫలమైందనే చెప్పాలి.
ఇప్పుడు మోదీ వికసిత్ భారత్‌కు పిలుపునిచ్చారు. దేశానికి బలమైన ప్రభుత్వం అవసరమని చెప్తున్నారు. అందుకు 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా పని చేయాలంటున్నారు. 400 సీట్లు సాధించాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన లక్ష్యాన్ని టార్గెట్‌గా పెట్టారు. వాస్తవానికి పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకత ఉంటుంది. సీట్లు తగ్గే పరిస్థితి ఉంటుంది. కానీ.. ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ.. 400 సీట్లలో విజయమే లక్ష్యమని బీజేపీ అంటుంది అంటే.. నరేంద్రుడికి ప్రజలపై స్పష్టమైన అవగాహన ఉంది. అంతప్రగాఢ విశ్వాసంతో మోదీ ఉన్నారంటే.. ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా ఆయన అంచనాలను కాదనలేమనే చెప్పాలి. టార్గెట్ రీచ్ అయ్యేందుకు.. కమలదళం సౌత్‌పై ఫోకస్ చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్య నాయకులు పర్యటిస్తున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలను ఏకం చేస్తున్నారు. దక్షిణాదిలో.. తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలో జనసేన, టీడీపీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకోగా.. తెలంగాణలో పదికి పైగా పార్లమెంట్ స్థానాలు గెలవాలని రాష్ట్ర న్యాయకత్వానికి సూచించారు. ఇక తమిళనాడులో బీజేపీ పొత్తు కూడగట్టుకోవడంతో పాటు.. ఆ రాష్ట్రంలో కూడా కమలం జెండా ఎగరేస్తామని చెప్తుంది. కర్నాటకలో కాంగ్రెస్ వ్యతిరేకతను బీజేపీ అందిపుచ్చుకుంది.
రాజకీయంలో పార్టీలో పొలిటికల్ స్టంట్స్ చేయాలి. మోసపూరిత రాజకీయాన్ని రాజకీయంతోనే దెబ్బకొట్టాలి. ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగట్టాలి. ఇవన్నీ తెలిసిన నేతల్లో మోదీ ఒకరు. ఆయనకు స్పష్టమైన టార్గెట్ ఉంది. స్పష్టమైన అవగాహన ఉంది. దేశాభివృద్ధి కొరకు… తన జీవితాన్నే అంకితమిస్తానని ప్రకటించిన ప్రధాని. దేశప్రజలే ఆయన కుటుంబసభ్యులుగా ప్రకటించుకొని తాను ఓ కుటుంబసభ్యుడినేనని పలు మార్కలు నొక్కిచెప్పిన పరిస్థితి చూశం. దేశంపట్ల ఆయనకున్న నిబ్బద్ధత, ఆయనకు ఉన్న కార్యదక్షత, మోదీకి ఉన్న సమయపాలన, మోదీకి ఉన్న ఖచ్చితత్వం మరే నాయకుడికి లేదు. దేశానికి బలమైన నాయకుడు కావాలి. దేశానికి సేవ చేసే నేతను ఎన్నుకోవాలి. ప్రపంచానికి భారత్ సత్తా చూపించి.. అగ్రరాజ్యాల సరసన మాకేం తక్కువ కాదు అని నిరూపించుకోవాలి. 75ఏళ్ల స్వతంత్ర్య భారత్‌లో.. గడిచిన 65ఏళ్లు వేరు.. ఈ పదేళ్లు వేరు.. ఇదంతా తెలిసే… వికసిత్ భారత్‌లో భాగస్వామ్యమయ్యేందుకు, నరేంద్రడి బాటలో నడిచేందుకు యువత కూడా సిద్ధంగా ఉంది.
శరత్ చారి
(జర్నలిస్ట్ 8790168565)

జైశ్రీరామ్ శరతాచారి గారు మీకు ధన్యవాదాలు శ్రీయుత మోడీ గారి గురించి చాలా విశ్లేష ణాత్మంకత్మకంగా రాసినందుకు మీకు అభినందనలు ఇట్లు కట్టా రమేష్ హనుమకొండ వరంగల్ తెలంగాణ.
ప్రపంచంలో ఏ దేశానికైనా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గా పోటీ చేస్తే ప్రపంచంలో దేశాలు ఎవ్వరు వద్దనరు ఆయన పరిపాలన ప్రపంచానికి అర్థమైంది భారతదేశ చరిత్రలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయం నెరవేరే విధంగా కమలం గుర్తుపై ఓటు వేసి ప్రధానమంత్రి చేస్తారు అని ఆశిస్తున్నాను
జైశ్రీరామ్ శరతాచారి గారు మీకు ధన్యవాదాలు శ్రీయుత మోడీ గారి గురించి చాలా విశ్లేష ణాత్మకంగా రాసినందుకు,మీకు అభినందనలు,ఇట్లు కట్టా రమేష్ హనుమకొండ వరంగల్ తెలంగాణ.
మంచి విశ్లేషణ
శరత్ చారి గారు అభినందనలు, సామాన్యునికి సైతం అర్థమయ్యే రీతిలో మంచి విశ్లేషణ, మన దేశ ప్రధాని చేసిన అభివృద్ధికి నిదర్శనం మన దేశ ఆర్థిక పరిస్థితి మరియు స్థితిగతులు, ప్రపంచ దేశాలలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత.
That’s modi ji
Jai Modi jai Bharat