Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

మమతా బెనర్జీకి షాక్

Praveen Reddy Naredla, 16/03/202616/03/2026
Spread the love
     

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకీ షాక్ ఇచ్చింది ఎన్నికల కమిషన్..ఎన్నికల కోడ్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఎన్నికల కమిషన్ పలు కీలక చర్యలు తీసుకుంది.ఎన్నికలు సజావుగా జరగడానికి,నిష్పక్షపాతంగా నిర్వహించడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని పలువురు ముఖ్యమైన అధికారులను బదిలీ చేసింది

చీఫ్ సెక్రటరీ,హోం సెక్రటరీలను తొలగింపు

ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ,హోం సెక్రెటరీ ఇద్దరినీ ఆ పదవుల నుండి తక్షణమే తొలగించాలని ఆదేశించింది.

కారణం: ఎన్నికల సమయంలో రాష్ట్ర పరిపాలన తటస్థంగా ఉండాలి. అయితే గత ఎన్నికల్లో జరిగిన హింసను సరిగ్గా నియంత్రించలేదనే ఆరోపణలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే SIR సమయములో ఎన్నికల విధులు సరిగా నిర్వహించలేదు అని 22 మంది అధికారుల పయి శాఖా పర చర్యలు తీసుకోండి అని EC ఆదేశిస్తే చర్యలు తీసుకోలేదు అని వీరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయం EC సుప్రీం కోర్టు కు కూడా చెప్పింది.

పోలీస్ అధికారుల జాబితా ఇవ్వాలని ఆదేశం

2026 మార్చి 15న ఎన్నికల కమిషన్ మరో కీలక ఆదేశం జారీ చేసింది.

2021 అసెంబ్లీ ఎన్నికలు

ప్రీ-పోల్ హింస
పోలింగ్ రోజు హింస

2024 లోక్‌సభ ఎన్నికలు
ప్రీ-పోల్ హింస
పోలింగ్ రోజు
పోస్ట్-పోల్ హింస

ఈ ఘటనలు జరిగిన పోలీస్ స్టేషన్లలో పనిచేసిన SHOs (Station House Officers), వారి పై అధికారులు (SP / DSP స్థాయి వరకు) పేర్లను మార్చి 16 సాయంత్రం 6 గంటలలోపు ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది. హింస జరిగిన ప్రాంతాల్లో చర్యలు తీసుకోండి అని EC ఎన్ని సార్లు చెప్పినా రాస్తా ప్రభుత్వ అధికారులు వినలేదు అనేది EC వాదన.

ఎందుకు ఈ చర్య?

పశ్చిమ బెంగాల్‌లో గత కొన్ని ఎన్నికలలో హింసాత్మక ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయి.

ప్రత్యేకంగా: 2021 West Bengal Legislative Assembly election సమయంలో, 2024 Indian general election సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు, రాజకీయ కార్యకర్తలపై దాడులు, ఓటర్లను బెదిరించడం వంటి ఘటనలు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేశారా లేదా? అన్నదాన్ని తెలుసుకోవడానికి ఈ జాబితాను కోరింది.

తప్పు చేసిన అధికారులకు ఏమవుతుంది?

ఎన్నికల కమిషన్ తెలిపిన ప్రకారం:
తప్పు చేసినట్టు నిర్ధారణ అయితే Article 311 of the Constitution of India ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం: సస్పెన్షన్, డిసిప్లినరీ యాక్షన్, ఉద్యోగం నుండి తొలగింపు వరకు చర్యలు తీసుకోవచ్చు.

ఇది ఎందుకు కీలకం?

ఈ చర్యతో ఎన్నికల కమిషన్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది:

  • అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా పనిచేయాలని
  • గతంలో జరిగిన హింసకు కూడా బాధ్యులను గుర్తిస్తామని ఈ సారి అలాంటివి జరగకుండా నిరోధించే ప్రయత్నాలు చేస్తాం.
  • ఎన్నికల సమయంలో హింసను సహించబోమని

దీనికి తోడు బీజేపీ కూడా మమతా బెనర్జీకి జలక్ ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ పరిణామం!రాబోయే West Bengal Legislative Assembly election కోసం Bharatiya Janata Party (BJP) మొదటి దశలోనే 144 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఆశ్చర్యకరంగా,ఈ జాబితాను All India Trinamool Congress (TMC) కంటే ముందుగానే ప్రకటించింది.ఈ జాబితాలో అత్యంత చర్చకు కారణమైన అంశం ఏమిటంటే —

Suvendu Adhikari
ప్రస్తుత ముఖ్యమంత్రి Mamata Banerjee పై నేరుగా పోటీకి దిగుతున్నారు. ఆయన రెండు చోట్ల పోటీ చేస్తున్నారు.

  • Bhabanipur — ప్రస్తుతం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం
  • Nandigram — గత ఎన్నికల్లో మమతాను ఓడించిన స్థానం

గుర్తు చేసుకుంటే, 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించడం దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ సంఘటనగా మారింది.

ఇప్పుడు మళ్లీ అదే నాయకులు రెండు కీలక నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా తలపడటం బెంగాల్ రాజకీయాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.

BJP ముందుగానే అభ్యర్థుల జాబితా విడుదల చేయడం ద్వారా ఎన్నికల వ్యూహాన్ని ముందుగానే ప్రారంభించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

బెంగాల్ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరమైన రాజకీయ పోటీగా మారే అవకాశం ఉంది.

— ఉపద్రష్ట పార్ధసారధి

ఇక్కడ TMC మమతా బెనర్జీ పార్టీకి బీజేపీ కి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.గత ఎన్నికల్లో సింపతీ ఓట్లతో గెలిచిన మమతా బెనర్జీ ఈసారి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR ప్రక్రియతో బాంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ ముస్లింల ఓట్లకు గండి పడుతుండడంతో ఆగమాగం అవుతుంది.గత ఎన్నికల్లో 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది.ఇక్కడ ఈసారి బీజేపీ గెలిచే అవకాశాలు లేకపోలేవు అని విశ్లేషకులు అంటున్నారు.ఇక్కడ 30 ఏళ్ళకు పైగా ఏలిన కమ్యూనిస్టులు,కాంగ్రెస్ తో కూటమిగా ఏర్పడి ఢీ కొట్టబోతుంది.కానీ ప్రధాన పోటీ బీజేపీ,టీఎంసీ మధ్యనే ఉండనుంది.

ఇప్పుడు ఎలెక్షన్ కమిషన్ చేపట్టిన చర్యలతో మమతా బెనర్జీ ఆగమాగం అవుతుంది.ఎలెక్షన్ కమిషన్ పై విరుచుకుపడుతుంది.ఇప్పటికే SIR తో మమతా బెనర్జీ అగ్గి మీద గుగ్గిలం అవుతుంది.దాదాపు 60 లక్షల ఓట్లు తొలగించింది ఎలెక్షన్ కమిషన్..ప్రధానంగా బాంగ్లాదేశ్ చొరబాటుదారులు,రోహింగ్యా ముస్లింలకు ఆశ్రయం ఇచ్చి వారికీ రేషన్ కార్డులు,ఆధార్ కార్డులు ఇచ్చి ఓటర్లుగా తయారుచేసుకోని ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెరదీసిన మమతకి ఎన్నికల కమిషన్ SIR తెచ్చి మమతా ఆశలపై నీళ్లు చల్లింది.ఇప్పటివరకు మైనారిటీ ఓట్లతో బుజ్జగింపు రాజకీయాలతో పశ్చిమ బెంగాల్ ని శాసిస్తున్న మమతా బెనర్జీకి ఈ ఎన్నికలు సవాల్ గా మారినయి..ఇక్కడ కమ్యూనిస్టులు,కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా బీజేపీ,తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి..కమ్యూనిస్టుల ఓటు బ్యాంక్ దాదాపుగా బీజేపీకి షిఫ్ట్ అయింది గత ఎన్నికల్లో..మరి ఈసారి ఎటు వైపు ఉంటారో..ఎవరిని గెలిపిస్తారో ఇంట్రెస్టింగ్ గా మారింది..సర్వేలు కూడా పోటా పోటీ అని తేల్చేస్తున్నాయి.చూడాలి మరి రెండు విడతల్లో జరుగనున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో వేచి చూద్దాం..


Spread the love
     
 
      
News National WestBengal #ElectionCommission #MamataBanerjee #ElectionViolence #IndianPolitics #MCC #PardhaTalks

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషనలో కంప్లైంట్ చేసిన శ్రీకాంత్
  • ముదిగంటి జితేందర్ రెడ్డి వర్ధంతి నేడు!!
  • మోడీజీ మన్ కీ బాత్ –Modi ji Mann ki baat
  • 2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్
  • కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి రాజీనామా-ఎమోషనల్ లేఖ !!

Recent Comments

  1. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  2. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  3. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. Madhu on కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | Terms & Conditions | Privacy Policy | Disclaimer