మన దేశంలో street protests ద్వారా రెజీమ్ చేంజ్ అంటే ప్రభుత్వ మార్పు సాధ్యమా?
నిన్న ప్రశాంత్ భూషణ్, లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ తర్వాత మిగతా వేరే ఆర్గనైజేషన్స్ మాటలు చూసిన తర్వాత నాకెందుకో ఈ డౌట్ వచ్చింది.
నవంబర్ 25, 1949 రోజున Constituent Assembly ముగింపు ప్రసంగంలో Dr.అంబేద్కర్ ‘రెజీమ్ చేంజ్’ (ప్రభుత్వ మార్పు), వీధి పోరాటాల గురించి ఏమన్నారో ఒకసారి ఇక్కడ చదవండి, ఇది చాలా ఇంపార్టెంట్.
“మనం ప్రజాస్వామ్యాన్ని కేవలం పేరుకే కాకుండా, నిజంగా కాపాడుకోవాలంటే మొదట చేయాల్సింది ఒకటే. మన సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి కేవలం రాజ్యాంగబద్ధమైన, చట్టపరమైన మార్గాలనే ఉపయోగించాలి. పాత రోజుల్లో బ్రిటీష్ పాలన ఉన్నప్పుడు మన సమస్యల కోసం చట్టబద్ధమైన మార్గాలు లేవు. కాబట్టి అప్పట్లో సత్యాగ్రహాలు, శాసనోల్లంఘనలు లేదా street protests చేయడంలో తప్పు లేదు. కానీ, మనకుంటూ ఒక రాజ్యాంగం, ఓటు హక్కు వచ్చి, అన్ని చట్టబద్ధమైన మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు… ఇంకా వీధి పోరాటాలు చేస్తామనడం అస్సలు సమర్థనీయం కాదు. ఇలాంటి పద్ధతులు దేశంలో కేవలం ‘అరాచకత్వాన్ని’ (అల్లకల్లోలాన్ని) మాత్రమే సృష్టిస్తాయి. అందుకే వీటిని ఎంత తొందరగా వదిలేస్తే దేశానికి అంత మంచిది.”
మరి ఈరోజు agitatations దిగిన వాళ్ళందరూ కూడా చేతిలో భారత రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని, అదొక పెద్ద ఫ్యాషన్ లాగా చూపిస్తున్నారు. అలా చూపిస్తూనే—’మేము protest ద్వారా రెజీమ్ చేంజ్ (ప్రభుత్వ మార్పు) చేస్తాం’ అని మాట్లాడుతున్నారు.
కానీ అది అస్సలు సాధ్యం కాదు. ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో వీధి పోరాటాల ద్వారా రెజీమ్ చేంజ్ అనేది ఎప్పుడూ, ఏ రోజు కూడా సాధ్యం కాలేదు; అసలు అలాంటి ఛాన్సే మన దేశంలో లేదు.
- 1. Telanagana agitation (1946-1951):
• ఉద్యమం: నిజాం భూస్వామ్య పాలనకు వ్యతిరేకంగా మొదలై, ఆ తర్వాత రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య ప్రక్రియను కాదని సాయుధ పోరాటం ద్వారా వ్యవస్థను మార్చాలని భావించింది.
• ఎందుకు విఫలమైంది: 1948 నాటి సైనిక చర్య (ఆపరేషన్ పోలో) తర్వాత ఈ పోరాటం బలహీనపడింది. చివరకు 1951-52లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేయడంతో ఈ సాయుధ వ్యూహం పూర్తిగా విఫలమైంది. - 2. నక్సల్బరీ / మావోయిస్ట్ ఉద్యమం (1967 నుండి ప్రస్తుతం):
• ఉద్యమం: “తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం” అనే సిద్ధాంతంతో భారత ప్రభుత్వ వ్యవస్థలను సాయుధ పోరాటంతో పడగొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
• ఎందుకు విఫలమైంది: దేశ భద్రతా దళాల వ్యూహాత్మక అణచివేత వల్ల ఇది ఢిల్లీ దాకా చేరలేకపోయింది. భారత ఓటర్లు ఎల్లప్పుడూ బ్యాలెట్ (ఓటు) వైపే మొగ్గు చూపడంతో ఈ ఉద్యమం కొన్ని అటవీ ప్రాంతాలకే పరిమితమైపోయింది. - 3. పంజాబ్ వేర్పాటువాద ఉద్యమం (1980వ దశకం):
• ఉద్యమం: విదేశీ శక్తుల మద్దతుతో, సాయుధ ఉగ్రవాదం మరియు వీధి హింస ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేసి ప్రత్యేక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని చూసింది.
• ఎందుకు విఫలమైంది: భారత భద్రతా దళాల కఠినమైన సైనిక చర్యల ద్వారా ఈ ఉగ్రవాద ప్రయత్నాన్ని దేశం పూర్తిగా అణచివేసింది. అంతిమంగా పంజాబ్ ప్రజలు హింసను తిరస్కరించి, మళ్లీ ప్రజాస్వామ్య ఎన్నికలను ఆదరించారు. - 4. జేపీ ఉద్యమం / సంపూర్ణ విప్లవం (1974-1975):
• ఉద్యమం: జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో వీధి పోరాటాల ద్వారా అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తీవ్ర ఒత్తిడి తెచ్చింది.
• ఎందుకు విఫలమైంది: ఈ వీధి పోరాటాల వల్ల నేరుగా ప్రభుత్వం పడిపోలేదు, పైగా దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి దారితీసింది. చివరికి మార్పు అనేది వీధుల ద్వారా కాకుండా, ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 ఎన్నికల ఓటింగ్ ద్వారానే సాధ్యమైంది.
మన దేశంలో ప్రభుత్వ మార్పు (Regime Change) చేయాలంటే వీధి పోరాటాలు ఎంతమాత్రం సరిపోవు. ఒకవేళ తీవ్ర నిరసనల వల్ల ఒక ప్రభుత్వం రాజీనామా చేసినా… దేశం మళ్లీ రాజ్యాంగబద్ధంగా ప్రజల తీర్పు కోసం ఎన్నికలకే వెళ్లాల్సి ఉంటుంది (పిలవాల్సింది) తప్ప, వేరే దేశాల లాగా సైన్యం ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ‘ఇతను పరిపాలిస్తాడు’ అని చెప్పే అవకాశం ఎక్కడా లేదు. ఎందుకంటే భారత సైన్యం ఎప్పుడూ కూడా రాజకీయాలకు అతీతంగా (Apolitical) ఉంటూ వచ్చింది.
మన ప్రజాస్వామ్యంలో ఏదైనా చేయగలిగే భౌతిక శక్తి ఒక్క సైన్యానికే ఉన్నప్పటికీ, వాళ్లు ఏ రోజూ ప్రజాస్వామ్య వ్యవస్థలో జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే సైన్యం దేశ రక్షణ కోసమే పనిచేస్తుంది మరియు అది ఎప్పుడూ president నియంత్రణలోనే ఉంటుంది; ఇక్కడ మన president ని ఎవరూ బలవంతంగా కింద పడేయలేరు.
అందుకే అంటాను, మన ప్రజాస్వామ్యం పొరుగున ఉన్న చిన్న దేశాల లాంటిది కాదు. భారతదేశం చాలా పెద్దది, ఇక్కడ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సమస్యలు ఉంటాయి.ఇలాంటి ఉపఖండంలో ఎవరో కొందరు వీధి పోరాటాలు చేస్తే వారి ఆత్మతృప్తికి పనికొస్తుందే తప్ప, దానివల్ల ‘రెజీమ్ చేంజ్’ జరగడం అసాధ్యం.
ప్రజాస్వామ్యంలో వీధి నిరసనలు చేయాల్సింది ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం మాత్రమే. అలా కాకుండా… ‘మేము కేవలం మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికే (Regime Change) వీధి పోరాటాలు చేస్తున్నాము, అందులో సక్సెస్ అవుతాము’ అని ప్రశాంత్ భూషణ్ లేదా left సంఘాలు మాట్లాడేవన్నీ ఉత్త మాటలు, అవి భారతదేశంలో ఏమాత్రం సాధ్యం కాని విషయాలు.
-Srini Journalist
