నరేంద్రమోడీని మరొక్కసారి గెలిపిద్దాం NaMoAgain

1999 నుంచి 2004 వరకు వాజ్ పేయి గారు
చేసిన మంచి పనులెన్నో..
26 పార్టీలని కలుపుకొని,కడదాకా నిలుపుకొని
ఎన్నో సంస్కరణలు..ఎన్నో పథకాలు..
ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా మారుమూలకి కూడా రోడ్లను వేయించి పల్లెల్లో పూల బాట పరిచిన ప్రభుత్వం..
సర్వశిక్షా అభియాన్ అంటూ ప్రతీఒక్కరికి విద్యా,
ప్రపంచం బెదిరించినా అణు పరీక్షలు చేసి భారత్ ను శక్తివంతం చేసిన ప్రభుత్వం..
ఎన్నో మంచి పనులు చేసినా చెప్పుకోలేక పోయిన పరిస్థితి…ఉచిత పథకాలకు మోసపోయి కాంగ్రెస్ ని గెలిపించి ఎన్ని అవినీతి స్కామ్స్ ని భరించామో,ఎన్ని బాంబు దాడులను చూశామో,ఎన్ని నక్సలైట్ల దాడులను విన్నామో,
ప్రపంచమంతట భారత దేశాన్ని చిన్నచూపు చూసిన సందర్భాలు ఎన్నో…
ఇటలీ మేడం పెత్తనంలో,రిమోట్ కంట్రోల్ పాలనలో,మతమార్పిడీలతో దేశాన్ని అల్లకల్లోలం సృష్టించిన రోజులు గుర్తున్నాయి కదా..
జవానులను చంపి వారి తలలను,మొండాలను వేరు చేసి పైశాచిక ఆనందం పొందిన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని చూసినం కదా..
మళ్ళీ 30 ఏళ్ల తరవాత ఒక సుస్థిర,సంపూర్ణ మెజారిటీ కలిగిన,సమర్థవంతమైన నాయకుడు ,దేశంకోసం రోజుకి 18 గంటలు పనిచేసిన నాయకుడు,ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతిని పెంచిన నాయకుడు,పాకిస్థాన్ కి పాకిస్థాన్ భాషలోనే బుద్ది చెప్పిన ధీరుడు,డిజిటల్ ఇండియా వైపుగా దేశాన్ని మార్చిన యోధుడు, స్వచ్ఛ భారత్ అంటూ దేశ గతిని ఒక్కసారిగా మార్చిన ప్రధాన సేవకుడు..

500 ఏళ్ల కల అయోధ్యలో శ్రీరాముడి మందిర నిర్మాణం పూర్తి చేసిన ధర్మ రక్షకుడు,370 ఆర్టికల్ ఎత్తేసి కాశ్మీర్ లో శాంతి నెలకొల్పిన వీరుడు,కరోనా కష్టకాలాన్ని చేదించిన యోధుడు,ప్రజలకు నచ్చిన ప్రధాన సేవకుడు
నరేంద్రమోడీ గారిని మరొక్కసారి సంపూర్ణ మెజారిటీ ఇచ్చి గెలిపించుకుందాం..

దేశం కోసం మరొక్కసారి నరేంద్రమోడీ…
NaMoAgain PhirEkBarModiSarkar OnceMoreNarendraModi

One thought on “నరేంద్రమోడీని మరొక్కసారి గెలిపిద్దాం NaMoAgain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *