ఎందుకంటే మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 3వేల ఓట్లతో ఓడిపోయాడు..ఓటర్లకు ఒక్క పైసా ఇయ్యకపోయినా..ఒక్క సీసా పొయ్యకపోయినా!
వెంటనే ప్రత్యర్థులు దాడి మొదలెట్టారు..
కరీంనగర్ లోనే గెలవలేదు..తెలంగాణలో అధికారం ఎలా తెచ్చేటోడు అని అందరూ (కొందరు సొంత పార్టీ నేతలు కూడా)..మరి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కేసీఆర్,కేటీఆర్ ఇలా ఒక్కడైనా గెలిచారా అంటే సమాధానం దొరకదు..
చాలా మంది అన్నారు ఓటుకి 500 ఇస్తే పక్కా గెలిచేవాడు అనవసరంగా ఓడిపోయాడు అని..
ఆరు నెలల తర్వాత జరిగే ఎంపి ఎన్నికల్లో బండి సంజయ్ అన్న ఎలాగూ చాలా సింపుల్ గా గెలుస్తాడు,మోడీ వేవ్ కూడా ఉంది.
గెలిస్తే మంత్రి పక్కా అని అందరూ అంటున్న సందర్భంలో ఎవరైనా ఏమి చేస్తారు..కోట్లు కుమ్మరించైనా గెలవాలని చూస్తారు.
పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు తప్పకుండా గెలవాల్సిన ఎన్నిక అందుకే నేనూ కూడా సంజయ్ అన్న అదే చేస్తాడు అని అనుకున్నా..

కానీ ఎంతమంది గెలుస్తామని చెప్పినా ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రోజు నుంచి పోలింగ్ రోజు ఎన్నికలు అయిపోయేదాకా ఎక్కడా లైట్ తీసుకోకుండా వెంటనే ప్రజాహిత యాత్ర పేరుతో పార్లమెంట్ మొత్తం కలియ తిరిగాడు.ప్రజలని కలిసి చేసిన అభివృద్ధి చెప్పుకొని గెలిపించాలని వేడుకున్నాడు..
అనేక సభలు,సమావేశాలతో క్యాడర్ ని పరుగులు పెట్టించాడు..
పోలింగ్ రోజూ వరకు ప్రతీ కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్స్ పెట్టి చేయాల్సిన పని,చేసే విధానం పూస గుచ్చినట్టు చెబుతూ నిత్యం బూత్ స్థాయి నుంచి పై స్థాయి దాకా క్యాడర్ తో డైరెక్ట్ గా మాట్లాడుతూ పనిచేశాడు..

చివరగా పోలింగ్ రోజు బూత్ ఏజెంట్లను కూడా టెలికాన్ఫరెన్స్ కాల్ తో మూడు గంటలకే లేపి పనిలో పెట్టి సూచనలు ఇచ్చి అద్భుతంగా గైడ్ చేశాడు..
పోలింగ్ రోజు మధ్య మధ్యలో కూడా కాల్ చేస్తూ ఓటింగ్ ఏ నియోజకవర్గంలో పోలింగ్ తక్కువగా ఉందో చెబుతూ..కొంచెం కష్టపడండి..మన ఓటర్లతో ఓటు వేపియ్యండి అని పోలింగ్ అయిపోయేదాకా నిత్యం కష్టపడ్డాడు సంజయ్ అన్న..చివరికి 2,25వేల ఓట్ల రికార్డ్ మెజారిటీతో అద్భుత విజయం పొందాడు..
ఇక్కడ ఓటర్లకు ఒక్క పైసా కూడా ఇయ్యకుండా,తప్పకుండా గెలవాల్సిన పరిస్థితిలో కూడా కార్యకర్తల సమిష్టి కష్టంతో గెలిచిన సంజయన్న రాజకీయాల్లో ఎదగాలని అనుకునే నాలాంటి ప్రతీ ఒక్క మధ్య తరగతి,పేద కార్యకర్తలకు తప్పకుండా స్పూర్తి ప్రధాతనే🚩🚩

ప్రజల్లో ఉంటూ,ప్రజల కోసం కష్టపడుతూ,ప్రతీ ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించే సంజయన్న వ్యక్తిత్వం మనం కూడా అలవరచుకొని పని చేస్తే డబ్బులు లేకుండా,ఓట్లు కొనకుండా ఎదగవచ్చు అనేది చేసి చూపెట్టిన సంజయన్నకి హ్యాట్సాఫ్🙏🙏🚩🚩🚩
Bandi Sanjay Kumar #నాస్పందన
